
ఉత్తరప్రదేశ్‌ను వరదలు ముంచెత్తాయి. చిత్రకూట్‌లో మందాకిని మాత ఉగ్ర రూపం దాల్చింది. శతాబ్ద కాలంలో అత్యధిక వరద స్థాయికి చేరుకుంది. నీటిమట్టం కారణంగా రామ్‌ఘాట్‌తో సహా అనేక లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఇళ్లు నీట మునిగాయి. చేసేదీమీలేక ప్రజలు రోడ్లుపైకి వచ్చేస్తున్నారు. మొదటి అంతస్తు వరకు ఇళ్లు నీట మునిగిపోయాయి. ఇక మధ్యప్రదేశ్ సంబంధాలు తెగిపోయాయి.

ఇక రంగంలోకి దిగిన సహాయ బృందం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక పరిపాలన యంత్రాంగం మందాకిని నది నీటిమట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రజలు నదికి, వరద నీటికి దూరంగా ఉండాలని, పరిపాలన యంత్రాంగం జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నీటిమట్టం తగ్గడంతో కొంత ఉపశమనం కలిగినా, ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదని చెబుతున్నారు.
పోలీసులు అప్రమత్తం
మందాకిని నది నీటిమట్టం పెరగడం వల్ల రామ్‌ఘాట్, నిర్మోహి అఖారా ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయి. భక్తులు, స్థానిక నివాసితుల భద్రతను నిర్ధారించేందుకు చిత్రకూట్ పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. పోలీసులు డ్రోన్ కెమెరాలతో వరద ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్‌లు వరద ప్రభావిత ప్రాంతాలను, ఘాట్‌ల దగ్గర నీటి పరిస్థితిని, ట్రాఫిక్ మార్గాలను ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న ప్రదేశాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్‌ల నుంచి పొందిన చిత్రాలు, ఫుటేజ్ సహాయక, రెస్క్యూ ఆపరేషన్లను మరింత సమర్థవంతంగా చేయడానికి తోడ్పడుతున్నాయి.

ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్‌ల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ప్రస్తుతం అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కృషి చేస్తున్నారు. స్థానికులను ఎత్తైన ప్రదేశాలలో ఉండమని, విలువైన వస్తువులను తీసుకుని ఇళ్లను విడిచి వెళ్ళమని సూచిస్తున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, నగరంలోని అనేక ప్రధాన రహదారులపై పడవలను ఉపయోగిస్తున్నారు.