Reading Time: 3 minutes

సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దిద్దండి .. లక్షలాది ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. అభ్యంతరాల గడువు మరో 4 వారాలు పెంచాలి

Caption of Image.
  • లక్షల మంది ఓట్లు గల్లంతయ్యే చాన్స్
  • అభ్యంతరాల స్వీకరణ గడువు 
  • మరో 4 వారాలపాటు పెంచాలి
  • ఎన్నికల కమిషన్​కు పూర్తిగా సహకరిస్తం
  • సీఈసీ జ్ఞానేశ్ కుమార్​కు సీఎం లేఖ
  • ఫ్యామిలీ సర్టిఫికెట్ల​ రిజెక్ట్​పై అబ్జక్షన్​
  • 73.39 లక్షల మందిని ‘ఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీడీ’ 
  • జాబితాలో పెట్టడంపై రేవంత్ రెడ్డి ఆందోళన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చేపట్టిన సర్ ప్రక్రియ క్షేత్రస్థాయిలో లోపభూయిష్టంగా సాగుతున్నదని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. లక్షలాది మంది అర్హులైన పౌరుల ఓటు హక్కు గల్లంతయ్యే ప్రమాదం ఏర్పడిందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శనివారం లేఖ రాశారు. రాష్ట్రంలోని మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లలో ఏకంగా 73.39 లక్షల మందిని (21.7 శాతం) ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్ (ఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీడీ) కేటగిరీ కింద చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ డిజిటలైజ్ చేసిన 2.65 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాల్లో ఏకంగా 60.50 లక్షల ఎంట్రీల్లో తప్పులు దొర్లాయని, మరో 32.36 లక్షల మందికి మునుపటి ఓటర్ల జాబితాతో లింక్ లేదని తేల్చారని గుర్తుచేశారు. వెరసి రాష్ట్రవ్యాప్తంగా 92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అంటే రాష్ట్రంలోని దాదాపు మూడో వంతు ఓటర్లు మళ్లీ తమ అర్హతను నిరూపించుకోవాల్సి రావడం లేదా ఓటు హక్కు కోల్పోయే విపత్కర స్థితి నెలకొన్నదని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.

బూత్ స్థాయిలో హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పెట్టండి 

ప్రస్తుతం ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు కేటాయించిన నెల రోజుల క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, అభ్యంతరాల షెడ్యూల్ అత్యంత స్వల్పమని, అక్టోబర్ 19న తుది జాబితా ప్రకటన ఉన్నందున ఈ గడువును మరో 4 వారాల పాటు పొడిగించాలని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిబంధనావళి ప్రకారం ముసాయిదా 
ఓటర్ల జాబితాలను గ్రామాలవారీగా గ్రామసభల్లో, పట్టణాల్లో వార్డు కమిటీల సమావేశాల్లో కనీసం రెండుసార్లు బహిరంగంగా చదివి వినిపించాలన్నారు.

నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు ప్రస్తుతం ఇస్తున్న వారం రోజుల గడువు ఏమాత్రం సరిపోదని, వలస కూలీలు, దినసరి వేతనదారులు, వృద్ధులు ఇతర జిల్లాల నుంచి పత్రాలు తెచ్చుకోవడానికి కనీసం 3 నుంచి 4 వారాల గడువు ఇవ్వాలని కోరారు. అర్హులకు పత్రాల సేకరణలో సహాయపడేందుకు పట్టణాల్లో ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో హెల్ప్‌‌డెస్క్‌‌లను తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు.

ట్రై-సిటీ పరిధిలోనే ఓట్ల వేట.. డాక్యుమెంట్లపై కొర్రీలు!

ఈ ‘సర్‌‌‌‌’ వెరిఫికేషన్ భారం మొత్తం హైదరాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలపైనే తీవ్రంగా పడిందని సీఎం రేవంత్‌‌ వివరించారు. రాష్ట్ర మొత్తం ఓటర్లలో ఈ మూడు జిల్లాల్లో మూడో వంతు ఓటర్లు ఉంటే.. మొత్తం ఏఎస్‌‌డీడీ ఎంట్రీల్లో 58.6 శాతం, విచారణ నోటీసుల్లో 41.9 శాతం ఇక్కడే కేంద్రీకృతమయ్యాయని స్పష్టం చేశారు. నగరాల్లో అద్దె ఇండ్ల మార్పులు, ఉద్యోగరీత్యా కొద్ది వందల మీటర్ల దూరంలో ఇళ్లు మారితే పోలింగ్ స్టేషన్ మారుతుందని, ఇలాంటి సాధారణ జీవన మార్పులను ఓటు హక్కు రద్దుకు కారణంగా చూపడం అన్యాయమని పేర్కొన్నారు. దీనికితోడు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ (జీవో నెం.172 )ను సర్ ధ్రువీకరణకు అంగీకరించబోమంటూ ఈసీ ఉత్తర్వులు ఇవ్వడం పట్టణ ఓటర్లను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని పేర్కొన్నారు. ఈ నిబంధన వల్ల పేద, మధ్యతరగతి ప్రజల వద్ద ఇతర ఆమోదయోగ్యమైన పత్రాలు లేక ఓట్లు గల్లంతవుతాయని, మండల స్థాయిలో సులభంగా లభించే పత్రాలన్నింటినీ ఆమోదించేలా స్పష్టమైన గైడ్‌‌లైన్స్ ఇవ్వాలని కోరారు.

క్షేత్రస్థాయిలో అదనపు అధికారులను నియమిస్తే పూర్తిస్థాయిలో సహకరిస్తాం

హైదరాబాద్ జిల్లాలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఏకంగా 78వేల పైచిలుకు నోటీసుల విచారణ భారం ఉందని, ఓటర్లు స్వయంగా అధికారి ఎదుట హాజరుకావాలనే నిబంధన ఇంత భారీ సంఖ్యలో అస్సలు ఆచరణ సాధ్యం కాదని సీఎం  రేవంత్‌‌రెడ్డి స్పష్టం చేశారు. అందువల్ల ఈఆర్‌‌వో (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) పరిధిని వికేంద్రీకరించి, క్షేత్రస్థాయిలో అదనపు అధికారులను నియమించి, నిర్దిష్ట తేదీలు, సమయాలతో కూడిన పద్ధతిలో విచారణ జరపాలని కోరారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు జాబితా నుంచి  పోకూడదని, అనర్హులకు చోటు దక్కకూడదన్నదే ప్రజాస్వామ్య లక్ష్యమని గుర్తుచేశారు. సహాయ కేంద్రాల ఏర్పాటు, గ్రామసభలు, వార్డు కమిటీల నిర్వహణ, విస్తృత ప్రచారం, ఇతరత్రా ఎన్నికల కమిషన్‌‌కు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌‌రెడ్డి తన లేఖలో హామీ ఇచ్చారు.

తాత్కాలిక వలసలకు.. శాశ్వత మార్పులకు తేడా లేదా?

బీఎల్వోల క్షేత్రస్థాయి పరిశీలన విధానంలో ప్రాథమిక లోపాలున్నాయని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పేర్కొన్నారు. బీఎల్వోలు తనిఖీకి వెళ్లిన సమయంలో పనిమీద బయటకు వెళ్లినవారిని, ఊళ్లకు వెళ్లినవారిని శాశ్వతంగా నివాసం మారినట్టు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీడీ జాబితాలోని 73.39 లక్షల మందిలో దాదాపు 62 శాతం (45.19 లక్షల మంది) ఓటర్లను ఏకపక్షంగా ‘శాశ్వతంగా వలస వెళ్లినట్టు’ వర్గీకరించారని తప్పుబట్టారు. సాధారణంగా ఇల్లు మారిన ఓటర్లకు కొత్త ప్రాంతంలో ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం-6 లాంటి ఎలాంటి సహాయం అందించకపోగా.. పాత నివాసాల్లో పేర్ల తొలగింపు జాబితాలో ఎలా పెడ్తారని లేఖలో నిలదీశారు. డేటా తప్పులు, మ్యాపింగ్ లేని ఎంట్రీలకు మాత్రమే నోటీసులు ఇస్తూ, ‘షిఫ్టెడ్’ కేటగిరీ కింద తొలగించే ఓట్లకు కనీస చట్టబద్ధమైన ముందస్తు నోటీసు ప్రక్రియను కూడా బైపాస్ చేస్తున్నారని, దీంతో పోలింగ్ రోజున ఓటు లేదని తెలిసి పౌరులు నిర్ఘాంతపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
 

©️ VIL Media Pvt Ltd.