Reading Time: < 1 minute

అమెరికాలో కూతురి పెళ్లి.. ఆన్లైన్లో అక్షింతలు వేసిన తల్లిదండ్రులు

Caption of Image.

పెళ్లంటే వారం పది రోజుల పండుగ. రెండు మూడు వారాల హడావుడి. ముహూర్తాలు చూసుకుని.. పెళ్లి పత్రికలు పంచి.. చుట్టాలందరినీ పిలిచి.. పందరి, ప్రతానం, లగ్గం.. ఇలా ఎంతో హంగామా ఉంటుంది. కానీ మారుతున్న కాలమాన పరిస్థితులతో పెళ్లి స్వరూపమే మారిపోతోంది. లేటెస్టుగా సూర్యాపేట జిల్లాకు చెందిన యువతి పెళ్లే అందుకు ఉదాహరణ.

వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన జయరాజు, జ్యోతి దంపతులకు  ఏకైక కుమార్తె హిమబిందు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న హిమబిందు అక్కడే పెళ్లి చేసుకుంది. 2026 ఆగస్టు 29వ తేదీన కూతురి పెళ్లిని టీవీలో చూస్తూ ఆన్ లైన్ లో అక్షింతలు వేశారు తల్లిదండ్రులు. 

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న హిమబిందుకు అక్కడే ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రోహిత్ కుమార్ పరిచయం జరిగింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరి వివాహం శుక్రవారం రాత్రి (ఇండియాలో శనివారం ఆగస్టు 29) వివాహం చేసుకున్నారు. 

అమెరికాలో జరిగిన పెళ్లిని తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో చూసి ఆశీర్వాదించారు. అనంతరం గ్రామంలో బంధువులు, అతిథులకు పెళ్లి విందు ఏర్పాటు చేశారు. 

©️ VIL Media Pvt Ltd.