
మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. కూతురుని నడుముకు కట్టుకుని మహిళ బావిలో దూకడం కలకలం రేపింది. ఈ ఘటనలో తల్లీ, కూతురు ఇద్దరూ చనిపోవడంతో కుటుంబం దుఖసముద్రంలో మునిగిపోయింది. 2026 ఆగస్టు 30వ తేదీన జరిగింది ఈ ఘటన.
భార్య భర్తల మధ్య కలహాలు తల్లితో సహా అభం శుభం ఎరుగని పసిపాప మృతి చెందేలా చేశాయి. జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం ఎనుగుమట్ల గ్రామానికి చెందిన మెరుగు రజిత (28)అనే వివాహిత మహిళ తన ఆరేండ్ల కూతురు అక్షిత ను నడుముకు కట్టుకొని బావిలో దూకుంది. సాయంత్రం 7 గంటల సమయంలో వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం దండేపల్లి మండలం లింగాపూర్ కు చెందిన గొట్ల లచ్చన్న కూతురు రజిత ను సుమారు 9 సంవత్సరాలక్రితం జగిత్యాల జిల్లా చెందిన మెరుగు అంజన్న తో వివాహం జరిపించారు. వీరి దాంపత్యంలో అక్షిత (6), బాబు (2) సంవత్సరాల పిల్లలు ఉన్నారు. భార్యభర్తల మధ్య గత నాలుగు నెలల నుంచి గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో మూడు నెలల నుంచి తల్లి గారి ఇళ్ళైనా లింగాపూర్ లో ఉంటుంది. మానసిక క్షోభ తో కుంగిపోయి రెండు సంవత్సరాల బాబు ను ఇంట్లో వదిలిపెట్టి పెద్ద కూతురు అక్షిత ను నడుంకు కట్టుకొని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న దండేపల్లి ఎస్ఐ రాజవర్ధన్ పంచానామా నిర్వహించి కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నామని పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.