Reading Time: < 1 minute

త్రిశూలి లోయలో ఆకస్మిక వరదలు : 1,643 మంది విద్యార్థులను కాపాడిన హెడ్మాస్టర్

Caption of Image.

ఆకస్మిక వరదల వేళ ఓ ప్రధానోపాధ్యాయుడి చొరవ పెను ప్రమాదాన్ని తప్పించింది. త్రిశూలి లోయలోని నువాకోట్ పాఠశాల ప్రిన్సిపాల్ రాజేంద్ర దావాడి (47) సమయస్ఫూర్తితో వ్యవహరించి 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడారు. నది ఉగ్రరూపం దాల్చి గ్రామాలు మునిగిపోతున్నాయన్న సమాచారం అందిన వెంటనే ఆయన పాఠశాల గంట మోగించి, తరగతులను ఖాళీ చేయించారు.

 విద్యార్థులందరినీ హుటాహుటిన ఎత్తైన కొండపైకి తరలించారు. వారు సురక్షిత ప్రాంతానికి చేరుకున్న కొద్ది నిమిషాల్లోనే పాఠశాల 3 అంతస్తుల భవనం వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడగా, తలుపులు వేసేందుకు వెళ్లిన అటెండర్, అల్పాహారం కోసం వెళ్లిన మరో ఉపాధ్యాయుడు ప్రవాహంలో గల్లంతయ్యారు. దావాడి చూపిన ధైర్యసాహసాలను స్థానికులు ప్రశంసిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.