సెప్టెంబర్ 14న వినాయక చవితి. అయితే ఇదే రోజు గ్రహాల అరుదైన సంచారం జరగనున్నదంట. ముఖ్యంగా కన్యా రాశిలో బుధుడు ఉచ్ఛస్థితిలో ఉండటం వలన మూడు రాశుల వారికి జీవితంలో ఉన్న అడ్డంకులు అన్నీ తొలిగిపోయి చాలా ఆనందంగా జీవిస్తారంట. కాగా, ఆ మూడు రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
సింహ రాశి : సింహ రాశిలో వినాయక చవితి సమయంలో సూర్యుడు సంచరిస్తుంటాడు. అందువలన ఈ రాశివారిపై వినాయకుడి చల్లని చూపు కూడా ఉంటుందంట. వీరు చేసే పనుల్లో అడ్డంకులు అన్నీ తొలిగిపోయి చాలా త్వరగా పనులు పూర్తి చేసుకుంటారు. అంతే కాకుండా కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
మకర రాశి : మకర రాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. వీరు తమ జీవితంలో ఎదురైన అనేక అడ్డంకుల నుంచి బయటపడతారు. మంచి జీవితానికి మొదటి అడుగు ఈ సమయం నుంచే ప్రారంభం అవుతుంద. అన్నివిధాలుగా వీరికి ఇది చాలా శుభ ప్రదమైన సమయం.
కన్యా రాశి : కన్యారాశి వారికి ఈ సమయం చాలా సంతోషంగా గడిచిపోతుంది. వినాయక చవితి నుంచి వీరికి మంచి రోజులు ప్రారంభం అయినట్లే, ఈ రాశి వారికి సంపద పెరుగుతుంది. అంతే కాకుండా వీరి జీవితంలో అన్నీ శుభాలే కలుగుతాయి. చాలా రోజుల నుంచి ఎవరు అయితే పనులు ప్రారంభించి అవి పూర్తి కాకుండా ఇబ్బంది పడుతున్నారో వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




