
ఆగస్టు 30న హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ట్రాఫిక్ అడ్వైజరీని వెల్లడించారు ట్రాళపిక్ పోలీసులు. 2026 ఆగస్టు 30న ఉదయం 4:30 నుంచి 9:30 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని చెప్పారు.
పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి GMC బాలాజీ స్టేడియం వరకు మారథాన్ నిర్వహిస్తున్నారు. నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మీదుగా రన్ ఉంటుంది. రోడ్ నంబర్ 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదుగా మారథాన్ కొనసాగింపు ఉంటుంది.
నెక్లెస్ రోడ్ వైపు వచ్చే వాహనాలకు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. పంజాగుట్ట, ఖైరతాబాద్, రాజ్‌భవన్ వైపు నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వెళ్లే వాహనాలకు అమీర్‌పేట్, రోడ్ నంబర్ 10, 12, క్యాన్సర్ హాస్పిటల్ మార్గాల్లో మళ్లించారు. ట్యాంక్‌బండ్ పరిసరాల్లోనూ పలు ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేశారు.
కేబుల్ బ్రిడ్జి నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 వైపు వాహనాలకు అనుమతి లేదు. వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులలు సూచించారు. అత్యవసర ప్రయాణ సాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్: 9010203626 నెంబర్ కు ఫోన్ చేయాల్సిందిగా తెలిపారు. మారథాన్‌కు సహకరించాలని వాహనదారులు, నగరవాసులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.