
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకం అద్భుతమైన ఫలితాలు సాధించిందని ప్రధాని మోదీ కొనియాడారు. దేశంలో ఆర్థిక సమానత్వాన్ని సాధించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకం శుక్రవారం నాటికి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా మోదీ స్పందిస్తూ.. ఆగస్టు 28, 2014న ప్రారంభమైన ఈ పథకం భారతదేశ ఆర్థిక రంగ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసిందని, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక చేరికకు ఇది మార్గదర్శిగా నిలిచిందని పేర్కొన్నారు. కనీస నిల్వ అవసరం లేకుండా ప్రతిఒక్కరికీ ప్రాథమిక బ్యాంక్ ఖాతా, ఉచిత రూపే డెబిట్ కార్డ్, రూ.2 లక్షల ప్రమాద బీమా, అత్యవసర సమయాల్లో రూ.10 వేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఈ పథకం ద్వారా అందుతున్నాయని తెలిపారు.
నేడు, రేపు ఉజ్బెకిస్తాన్ లో ప్రధాని పర్యటన
ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్‌కత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆగస్టు 29,-30 తేదీల్లో తాష్కెంట్‌లో పర్యటించనున్నారు.