
Suryakumar Yadav: భారత్ కి టీ20 వరల్డ్ కప్ 2026 అందించిన మూడో కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. సారథిగా సక్సెస్ అయినప్పటికీ, బ్యాటర్‌గా ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో బీసీసీఐ అతడిని తప్పించి శ్రేయస్ అయ్యర్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది. కెప్టెన్సీ మార్పు జరిగిన రెండు నెలల తర్వాత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఇంటర్వ్యూలో సూర్య భాయ్ తొలిసారి తన మనసులోని అసలు ముచ్చటని బయటపెట్టాడు.
స్క్వాడ్‌లో నా పేరు లేకపోవడం చూసి షాక్ అయ్యను:
సెలెక్షన్ కమిటీ ప్రకటించిన లిస్టులో తన పేరు లేకపోవడంతో ఫస్ట్ నవ్వొచ్చిందని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు. స్టేడియంలో ఎంత ఒత్తిడి ఉన్నా, పరిస్థితులు చేయి దాటిపోతున్నట్లు అనిపించినా నేను చిరునవ్వుతోనే నా మైండ్ ని రిలాక్స్ చేసుకుంటా.. నా అనుభవాలను, దక్కిన అవకాశాలను గుర్తు చేసుకుంటాను.. కెప్టెన్సీ నుంచి తప్పించిన రోజు కూడా అలాగే ఆలోచించి రిలాక్స్ గా ఉన్నాను అని స్కై పేర్కొన్నాడు.
ఎందుకు తీసేశారో అర్థం కాలేదు:
2026 వరల్డ్ కప్ తర్వాత మరో రెండేళ్ల పాటు భారత జట్టుని నడిపిస్తానని, ఒలింపిక్స్‌తో పాటు తర్వాతి టీ20 ప్రపంచకప్‌లోనూ కెప్టెన్‌గా ఉంటానని భావించినట్లు సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. కానీ గడిచిన రెండేళ్లలో ఒక్క సిరీస్ కూడా ఓడిపోలే, టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్‌లను గెలిచామని గుర్తుచేశాడు. అంతా బాగున్నప్పుడు నన్ను ఎందుకు తుది జట్టు నుంచి తప్పించారో అర్థం కాక దాదాపు నెలన్నర రోజులు ఇంట్లోనే సైలెంట్ గా ఉండిపోయానని సూర్య బాధ పడ్డాడు.
శ్రేయస్ అయ్యర్‌పై ఎలాంటి కోపం లేదు:
ఎన్ని ప్రశ్నలు ఉన్నా బీసీసీఐ (BCCI) నిర్ణయాన్ని తాను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నట్లు మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. ఇక కొత్త సారథి శ్రేయస్ అయ్యర్ మంచి ప్లేయర్, అతనిపై నాకు ఎలాంటి కోపం లేదని తేల్చి చెప్పేశాడు. వేరొకరి సారథ్యంలో జట్టు మరింత బాగా రాణిస్తే అది మన దేశానికే మంచిది.. బీసీసీఐ నుంచి ఎప్పుడు పిలుపువచ్చినా మళ్లీ దేశం కోసం ఆడేందుకు నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను అని సూర్య క్లారిటీ ఇచ్చాడు.
🚨 Suryakumar Yadav statement on dropped from the team after winning the T20 World Cup 26 🚨
“The one he chose, I played a lot of cricket with Shreyas, he is a good player, good human being & good captain also”.
“So I don’t think, why did you make this ? I was a little… pic.twitter.com/f7p1Kck3Dt
— Vikas (@Vikas662005) August 29, 2026