
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా: మేడిపల్లి పీఎస్ పరిధిలోని పీర్జాదిగూడ గ్రీన్ ల్యాండ్స్ కాలనీలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. మేడిపల్లి పీఎస్ పరిధిలోని పీర్జాదిగూడ BPM గ్రీన్లాండ్స్ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి నలుగురు దొంగలు చోరీకి విఫల యత్నం చేశారు.
కాలనీ మొత్తం తిరుగుతూ చోరీ చేయడానికి ప్రయత్నించారు. ఒక ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఏమీ లేకపోవడంతో పక్కనే ఉన్న మరో ఇంట్లోకి గోడ దూకి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అది చూసిన మహిళ గట్టిగా కేకలు వేయడంతో దొంగలు అక్కడి నుండి పారిపోయారు.
కాలనీలో దాదాపు చాలాసేపు చోరీ చేయడానికి దొంగలు విఫల యత్నం చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా రేయింబళ్లు చోరీలు హల్చల్ చేస్తూ.. పోలీసులకు సవాల్విసురుతున్నారు.