
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రను ఇండియన్ పీపుల్స్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్వహణలో సినిమాగా తీసుకువస్తున్నారు.2026 ఆగస్టు 30న పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో సినిమాకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.
గోదావరిఖని మున్సిపల్ ఆఫీస్ టీ జంక్షన్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు కళాకారులు. ఈ సినిమా ను 1000 మంది సహా నిర్మాతల సహకారంతో నిర్మిస్తుంన్నట్లు సినిమా డైరెక్టర్ సేనాపతి చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుండి 32 మందిని నిర్మాణంలో భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో చిత్ర యూనిట్ ఈ యాత్రను చేపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కళాకారులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.