కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. గోధుమ పిండి, బొంబాయి రవ్వ, గుమ్మడి గింజలు, యాలకులు లేదా యాలకుల పొడి, బెల్లం, నెయ్యి, బాద ప్పులు, లేదా జీడిపప్పులు.
తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా స్టవ్ ఆన్ చేయాలి అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి. అలాగే నెయ్యి కరుగుతున్న సమయంలోనే అరకప్పు బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి. పచ్చివాసన పూర్తిగా పోయే వరకు మంచిగా వేయించుకుంటూ ఉండాలి.
ఇక ఇది పూర్తిగా వేగిపోతుంది అనే సమయంలో అందులో గోధుమ పిండి వేసుకోవాలి. కప్పు బొంబాయి రవ్వ వేస్తే రెండు కప్పుల గోధుమ పిండి వేయాలి. అలాగే అందులోనే బాదం, గుమ్మడి గింజలు వేసి మంచిగా వేయించుకోవాలి. ఎప్పుడూ కూడా పిండి మొత్తం మారిపోకుండా చూసుకోవాలి. అలాగే బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.
ఇక పిండి బంగారు రంగులోకి వచ్చిన తర్వాత అందులో వేడి పాలు పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. కలిపి అది మంచిగా కలిసి పొడి పొడిగా మారనివ్వాలి. తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని చేతులతో మంచిగా కలుపుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా చూసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో కొన్ని నీళ్లు పోయాలి. అందులో బెల్లం వేయాలి. బెల్లం రసం చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత అందులో యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత ఆ నీరు పూర్తిగా చల్లారక ముందే వాటిని పిండి మిశ్రమంలో వేసి బాగా కలపాలి. అదే సమయంలో మరో రెండు టీ స్పూన్ల నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న లడ్డూల్లా తయారు చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి అంతే.




