Reading Time: < 1 minute

FSSAI: ఎవరెస్ట్ ఇంగువపై నిషేధం.. మసాలాల్లో నాణ్యత లేదని తేల్చిన ఫుడ్సేఫ్టీ అధికారులు

Caption of Image.

ప్రముఖ మసాలాల తయారీ  కంపెనీ ఎవరెస్ట్ ఫుడ్ ప్రాడక్ట్స్ పై ఫుడ్ సేఫ్టీ డిపార్టుమెట్ కఠిన చర్యలు చేపట్టింది. కంపెనీ తయారు  చేస్తున్న మసాలాల్లో  నాణ్యత లేదని,  ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని కంపెనీకి నోటీసులిచ్చింది. ఎవరెస్ట్ కంపెనీ తయారు చేసిన ఇంగువపై నిషేధం విధించింది. చికెన్ మసాలా, గరం మసాలా ఎగ్ కర్రీ మసాలా  ఉత్పత్తులలో నాణ్యత లేదని తేల్చింది. నాణ్యత  ప్రమాణాలు పాటించే వరకు నిషేధం కొనసాగుతుందని హెచ్చరించింది.   

కస్టమర్లు ఇచ్చిన ఫిర్యాదులతో ముంబైలోని ఎవరెస్ట్ కంపెనీపై దాడులు చేసిన FSSAI  శాంపిల్స్​ ను సేకరించి ల్యాబ్​ లో  టెస్టులు నిర్వహించగా నాణ్యతాప్రమాణాల్లో లోపించాయని  ఫుడ్​ సేఫ్టీ అధికారులు గుర్తించారు. గరం మసాలా, చికెన్​ మసాలా, ఎగ్​ కర్రీ మసాలా ప్రాడక్టులపై  కూడా FSSAI   నోటీసులు జారీ చేసింది. ఈ ప్యాకెట్లలో 5 కంటే ఎక్కువగా ఉప్పు, మసాలా దినుసుల కంటెంట్ స్ఫష్టంగా లేదని వెల్లడించారు. 

మసాలాలలో మొత్తంలో స్టార్చ్ ఉన్నట్లు తేలడంతో, ఆ బ్రాండ్ విక్రయాలపైనా నిషేధం విధించారు. భవిష్యత్తులో నిబంధనలు పాటించేలా ,లోపాలను సరిదిద్దేలా ఓ ప్రణాళిక రూపొందించి సమర్పించాలని FSSAI ఈ కంపెనీలను ఆదేశించింది.

ఈ ప్యాకెట్లపై 5శాతం కంటే ఎక్కువ ఉప్పు (Salt) శాతం వివరాలను, మసాలా దినుసుల అసలు కంటెంట్‌ను స్పష్టంగా ప్రకటించలేదని అధికారులు గుర్తించారు. మరో కంపెనీపై కూడా చర్యలు చేపట్టారు.ఎవరెస్ట్‌తో పాటు దేశంలోనే నవంబర్​ బ్రాండ్​ ప్రముఖ ఇంగువ బ్రాండ్ లాల్జీ గోధూ అండ్ కంపెనీ ఇంగువ శాంపిల్స్​ లో కూడా నాణ్యత లోపించి, ఎక్కువ మొత్తంలో స్టార్చ్ ఉన్నట్లు తేలడంతో, ఆ బ్రాండ్ విక్రయాలపైనా నిషేధం విధించారు.

©️ VIL Media Pvt Ltd.