Reading Time: < 1 minute

లక్నోలో లాయర్ల ఆఫీసులను.. బుల్డోజర్లతో కూల్చేశారు

Caption of Image.

యూపీ రాజధాని లక్నోలో హైటెక్షన్ వాతావరణం నెలకొంది. లక్నోలో ఢిల్లీ మేజిస్ట్రేట్ కార్యాలయం ఆఫీసు చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య కోర్టు, రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ లాయర్లు ఏర్పాటు చేసుకున్న అక్రమ ఛాంబర్లను నేలమట్టం చేశారు. లాయర్లు తీవ్రంగా వ్యతిరేకంచడంతో ఘటనాస్థలంలో ఉద్రిక్తత నెలకొంది. 

ఆదివారం (ఆగస్టు30)  లక్నో మున్సిపల్ కార్పొరేషన్​ అధికారులు  లక్నోలోని ఢిల్లీ మేజిస్ట్రేట్​ ఆఫీసు చుట్టూ ఉన్న లాయర్ల కార్యాలయాల నిర్మాణాలను ఆరు బుల్డోజర్లతో కూల్చివేశారు. గత కొన్నేళ్లుగా  లాయర్లు ఈ ప్రాంతంలో స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారని మున్సిపల్​ కార్పొరేషన్​ అధికారులు ఆరోపించారు. అనేకమార్లు నోటీసులు ఇచ్చినా  స్పందించకపోవడంతో కూల్చివేతలు చేపట్టామని  చెప్పారు.  కూల్చివేతల సమయంలో భారీగా పోలీసులను మోహరించారు. 
 
కోర్టు పరిసరాల్లో ఉన్న 72 అక్రమ నిర్మాణాలను తొలగించాలని అలహాబాద్​ హైకోర్టు లక్నో బెంచ్​ఇటీవల మున్సిపల్​ కార్పొరేషన్​ ను ఆదేశించింది. ఈ విషయంపై లాయర్లు  సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. అయితే లాయర్లకు చుక్కెదురైంది.  లాయర్లు స్పందించకపోవడంతో హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలను తొలగించారు. 

©️ VIL Media Pvt Ltd.