July 12, 2026

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌.. ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌.. ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు
Reading Time: < 1 minute
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌.. ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. ముఖ్యంగా వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బిగ్ అలర్ట్ ఇచ్చింది. రాబోయే మూడు నెలల్లో శ్రీవారి ఆలయంలో జరిగే వివిధ పర్వదినాలు, వార్షిక ఉత్సవాలను పురస్కరించుకుని పలు తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 17న ఆణివార ఆస్థానం, 19న శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద, 29న జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం సందర్భంగా బ్రేక్ దర్శనాలు ఉండవు. అలాగే, ఆగస్టు 22న పవిత్రోత్సవాలకు అంకురార్పణ, 24న పవిత్రోత్సవాల రెండో రోజు సందర్భంగా వీఐపీ దర్శనాలు రద్దు చేశారు. ఇక సెప్టెంబర్ 8న బ్రహ్మోత్సవాల కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 14న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కాగా, సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కారణంగా బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. ఈ పర్వదినాల సందర్భంగా నిర్ణీత తేదీలకు ముందు రోజు తిరుమలలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా ఎలాంటి వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది. కాబట్టి భక్తులు ఈ మార్పులను గమనించి, అందుకు అనుగుణంగానే తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కళ్లాపి పొడి కాదు.. ప్రాణాంతక విషం! మహిళలూ జాగ్రత్త!

రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్‌!

టెంకాయి, రూపాయితోనే మూడు ముళ్లు.. కట్నం గొడవే లేని ఆదర్శ గ్రామాలు!

సమాధిలో 2,300 ఏళ్ల నాటి మద్యం లభ్యం

డాన్స్‌ రాకపోతే రాదని చెప్పాలి కానీ.. పెళ్లి చెడగొట్టుకుంటావా సామీ!