Reading Time: < 1 minute
Redmagic 11s Pro Launching On May 18 With 8000mah Battery And 144hz Amoled Display

REDMAGIC 11S Pro: గేమింగ్ స్మార్ట్‌ఫోన్లకు ప్రసిద్ధి చెందిన రెడ్‌మ్యాజిక్ (REDMAGIC) సంస్థ తన కొత్త REDMAGIC 11S Pro సిరీస్ స్మార్ట్‌ఫోన్లను మే 18న చైనాలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. తాజాగా ఈ సిరీస్ ఫోన్ల డిజైన్‌ను కూడా అధికారికంగా వెల్లడించింది. ప్రీమియం లుక్‌తో పాటు పవర్‌ఫుల్ గేమింగ్ ఫీచర్లతో ఈ ఫోన్ టెక్ ప్రియులను ఆకర్షించేలా ఉంది. REDMAGIC 11 Pro సిరీస్‌లో కనిపించిన ఫ్యామిలీ-స్టైల్ డ్యూటీరియం బ్లేడ్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌ను ఈ కొత్త సిరీస్‌లో కూడా కొనసాగించింది. ఫోన్‌లో డ్యూయల్ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు. సిల్వర్ వింగ్, డార్క్ నైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.

ఈ సిరీస్‌లోని ఫోన్లు Snapdragon 8 Elite Gen 5 Leading ఎడిషన్ ప్రాసెసర్‌తో రానున్నట్లు కంపెనీ ఇప్పటికే కన్ఫామ్ చేసింది. గేమింగ్ సమయంలో అధిక వేడి సమస్యలను తగ్గించేందుకు యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్, వాటర్ కూలింగ్ డిజైన్‌ను కూడా అందిస్తోంది. అంతేకాదు 2K 144Hz సూపర్ రెజల్యూషన్, సూపర్ ఫ్రేమ్ సపోర్ట్‌తో మొబైల్ గేమింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచనుంది. ఇక REDMAGIC 11S Pro+ Geekbench 6 బెంచ్‌మార్క్ లిస్టింగ్ కూడా ఇటీవల వెలుగులోకి వచ్చింది. Nubia NX809J మోడల్ నంబర్‌తో కనిపించిన ఈ ఫోన్ సింగిల్ కోర్‌లో 4010 స్కోర్, మల్టీ కోర్‌లో 11187 స్కోర్ సాధించింది. Geekbench 6 సింగిల్ కోర్ టెస్టింగ్‌లో 4000కి పైగా స్కోర్ సాధించిన తొలి ఆండ్రాయిడ్ ఫోన్ ఇదేనని సమాచారం.

స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. REDMAGIC 11S Pro+లో 6.85 అంగుళాల 1.5K 144Hz AMOLED డిస్‌ప్లే ఉండనుంది. 7500mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో పాటు 120W ఫాస్ట్ ఛార్జింగ్, 80W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనున్నాయి. అదే REDMAGIC 11 Pro మోడల్‌లో 8000mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. గేమింగ్ ప్రియులకు ఈ ఫోన్లు పవర్‌ఫుల్ ఆప్షన్‌గా మారనుంది. ఈ ఫోన్ల ధరలు, పూర్తి వివరాలు వచ్చే వారం (మే 18) అధికారిక లాంచ్ సందర్భంగా తెలియనున్నాయి.