July 14, 2026

Salman Khan: బాలీవుడ్ హిట్ జోడీ మళ్ళీ రిపీట్..

Salman Khan: బాలీవుడ్ హిట్ జోడీ మళ్ళీ రిపీట్..
Reading Time: < 1 minute
Salman Khan Kareena Kapoor New Superhero Movie Raj And Dk

బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ హాట్ బ్యూటీ కరీనా కపూర్ గతంలో ‘క్యోం కీ’, ‘మై ఔర్ మిసెస్ ఖన్నా’, ‘బజరంగీ భాయ్‌జాన్’ వంటి విజయవంతమైన చిత్రాలతో హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ దర్శకులు రాజ్‌ అండ్ డీకే రూపొందిస్తున్న ఓ చిత్రంలో సల్మాన్ ఖాన్ సూపర్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. కాగా ఈ క్రేజీ ప్రాజెక్టులో నాయికగా కరీనా కపూర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో తన సరసన నటించాల్సిందిగా సల్మాన్ ఖాన్ స్వయంగా కరీనాను సంప్రదించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, ఇందులో నటించడానికి కరీనా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే ఈ అద్భుతమైన కాంబినేషన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దాదాపు దశాబ్దం తర్వాత ఈ జోడీ మళ్ళీ తెరపై కనిపించనుండటంతో అభిమానుల్లో అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి.