
రియల్‌మీ GT 2 భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ MRP రూ.39,999 కాగా 38% తగ్గింపుతో లభిస్తోంది. రూ.15,000 తక్కువకే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో 38% తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది . ఈ ఫోన్ MRP రూ. 39,999 కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో ఇది రూ. 24,999 కే లభిస్తోంది. ఇందులో 8 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై కంపెనీ నేరుగా రూ. 15,000 తగ్గింపును ఇచ్చింది. అంతేకాకుండా, వినియోగదారుడు ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే, అదనంగా రూ. 1250 ఆదా చేసుకోవచ్చు, ఆ తర్వాత ఫోన్ అసలు ధర రూ. 23,749 అవుతుంది .
స్పెసిఫికేషన్లు
రియల్‌మీ GT 2 లో 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో కూడిన 6.62-అంగుళాల ఫుల్-HD+ (1,080×2,400 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది, దీనికి 12GB వరకు LPDDR5 RAM తో వస్తోంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, f/1.8 లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అమర్చారు. ఈ ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో వైడ్-యాంగిల్, మాక్రో కెమెరాలు కూడా ఉన్నాయి. అలాగే ఇందులో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
రియల్‌మీ GT 2 లో 256GB వరకు UFS 3.1 స్టోరేజ్ ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC, ఒక USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. రియల్‌మీ ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీని అమర్చింది, ఇది 65W సూపర్‌డార్ట్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది.