Reading Time: < 1 minute

హైదరాబాద్ హాస్టల్స్లో ఉంటున్నోళ్లకు షాక్.. ఉదయం టిఫిన్స్‌‌‌‌లో ఇక ఇవి కట్..!

Caption of Image.

హైదరాబాద్: కమర్షియల్ సిలిండర్ ధరలు దేశంలో మునుపెన్నడూ లేనంతగా పెరిగాయి. ఒక్క కమర్షియల్ సిలిండర్ ధరపై 993 రూపాయలు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఒకేసారి 42 శాతం పెంచుతూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. 

ప్రధాని మోదీని ‘ఇన్ఫ్లేషన్ మ్యాన్’ అని ఎద్దేవా చేశాయి. హైదరాబాద్ సిటీలో ఒక కమర్షియల్ సిలిండర్ ధర ఈ పెంపు తర్వాత 3 వేల 3 వందల 15 రూపాయలకు చేరింది. ఇంత పెట్టి కొనాలంటే కష్టమని భావిస్తున్న.. హోటల్స్, హాస్టల్స్ మళ్లీ కట్టెల పొయ్యి వైపు చూస్తున్నాయి. హోటల్స్ మెనూలో రేట్లు పెంచేశాయి. హాస్టల్స్కు అలా హాస్టల్ ఫీజు పెంచే పరిస్థితి లేకపోవడంతో ఫుడ్ మెనూలో కొన్నింటికి స్వస్తి పలకాలని హాస్టల్ నిర్వాహకులు డిసైడ్ కావడం గమనార్హం.

హైదరాబాద్ నగరంలో దాదాపు 20 వేల వరకు హాస్టల్స్ ఉన్నాయి. వీటిల్లో దాదాపు 6 లక్షల ఐటీ ఎంప్లాయీస్​, మరో 8 లక్షల మంది స్టూడెంట్స్, 4 లక్షల మంది వరకు నాన్​ఐటీ ఎంప్లాయీస్, వర్కింగ్​విమెన్స్‌‌​ఉంటున్నారు. గ్యాస్ ధర పెంపుతో కొద్ది రోజులు పొదుపు చర్యలు పాటించాలని హైదరాబాద్ హాస్టల్స్ డిసైడ్ కావడంతో హాస్టల్స్లో ఉంటున్న వాళ్లకు పెద్ద సమస్యే వచ్చి పడింది. ఉదయం టిఫిన్స్‌‌‌‌లో భాగంగా పెట్టే వడ, దోశ, పూరి, చపాతీ, మైసూర్ బోండాలకు తాత్కాలికంగా మంగళం పాడే దిశగా చాలా హాస్టల్స్ యోచన చేస్తున్నాయి.

ఉదయం టిఫిన్స్గా ఇడ్లీ, ఉప్మాతో సరిపెట్టాలని.. బేసిక్ మీల్స్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నాయి. గ్యాస్​సిలిండర్ల ధరల పెంపుతో.. కేపీహెచ్‌‌‌‌బీ, కూకట్‌‌‌‌పల్లి, మాదాపూర్, కొండాపూర్​, గచ్చిబౌలి ఏరియాల్లోని హాస్టల్​నిర్వాహకులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కట్టెల పొయ్యిపై వంట చేయడానికి కట్టెలు తెచ్చి పెట్టుకుంటున్నారు.

©️ VIL Media Pvt Ltd.