July 16, 2026

మతం పేరుతో ఎస్సీ హోదాను తొలగించడం రాజ్యాంగ విరుద్ధం

మతం పేరుతో ఎస్సీ హోదాను తొలగించడం రాజ్యాంగ విరుద్ధం
Reading Time: < 1 minute

మతం పేరుతో ఎస్సీ హోదాను తొలగించడం రాజ్యాంగ విరుద్ధం

Caption of Image.

గ్రేటర్​ వరంగల్, వెలుగు: మతం పేరుతో ఎస్సీ హోదాను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని వరంగల్​ కాంగ్రెస్​ డీసీసీ ప్రెసిండెంట్ మహ్మద్ ఆయూబ్ అన్నారు. గురువారం సిటీలోని పోచమ్మమైదాన్​లోని ఓ హోటల్ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి డీసీసీ ప్రెసిండెంట్ ఆయూబ్, డాక్టర్, ప్రొఫెసర్ ఆర్ పీఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గాలి వినోద్ కుమార్, ఈర్ల కుమార్ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మతం మారినంత మాత్రాన కులం మారదని, మతం పేరుతో ఎస్సీ హోదాను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దళిత క్రైస్తవుల హక్కుల సాధన కోసం అన్ని సంఘాలు ఏకమై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, న్యూ డెమోక్రసీ, రిపబ్లిక్ సంఘాలు పాల్గొన్నాయి.

©️ VIL Media Pvt Ltd.