Reading Time: 2 minutes
Priyanka Gandhi On Women Reservation Bill Democracy Victory Opposition

శాశ్వతంగా అధికారంలో ఉండాలని బీజేపీ కుట్ర పన్నిందని.. ఆ కుట్రను ప్రతిపక్షాలు తిప్పికొట్టాయని వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ అన్నారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై ఢిల్లీలో మీడియాతో ప్రియాంకాగాంధీ మాట్లాడారు. విపక్షాలన్నీ ఏకమైతే ప్రభుత్వానికి ఓటమి తప్పదని నిన్నటి ఘటనతో రుజువైందన్నారు. ప్రజాస్వామ్యం గెలిచిందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో ఇతర బిల్లులు కలపకుండా.. 2023లో ఆమోదం పొందిన బిల్లునే తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని కేంద్రం కుట్ర చేసిందని ఆరోపించారు. దేశం మారింది.. ప్రజలు అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకుంటే మాత్రం పరిస్థితులు ఇలానే ఉంటాయని సూచించారు.

ఇది కూడా చదవండి: Macron-Meloni Kiss: ఇటలీ ప్రధాని మెలోని బుగ్గపై ముద్దు పెట్టిన మాక్రాన్.. వీడియో వైరల్

తమిళనాడు, బెంగాల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం హడావిడిగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసిందన్నారు. సమావేశాల తర్వాత అజెండాను ప్రకటించదని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును సాకుగా చూపించి డీలిమిటేషన్ బిల్లును ఆమోదించి స్వప్రయోజనాలను పొందాలని చూసిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని మహిళా వ్యతిరేకులుగా చిత్రీకరించాలని బీజేపీ చూస్తోందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: AP Singh: అమెరికా యుద్ధ విమానంలో భారత్ ఎయిర్ చీఫ్ ఏపీ సింగ్ పర్యటన.. ఫొటోలు వైరల్

ఈనెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను కేంద్రం ఏర్పాటు చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. దాదాపు 22 గంటల పాటు చర్చ చేపట్టిన తర్వాత ఓటింగ్ నిర్వహించింది. అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓట్లు వేశారు. మూడింట రెండొంతుల మెజార్టీ లేకపోవడంతో బిల్లులు వీగిపోయినట్లుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దీంతో బిల్లులు వెనక్కి తీసుకుంటున్నట్లుగా కేంద్రం తెలిపింది.