Reading Time: < 1 minute
Chicken Prices : అక్కడ కేజీ చికెన్ ధర రూ.2500 అట.. ఎందుకు అంత రేటో తెలుసా?

సాధారణంగా మన దగ్గర కేజీ చికెన్ ధర రూ.200 నుంచి 300 మధ్య ఉంటుంది. కాని స్విజ్జర్లాండ్‌లో కేజీ కోడి మాసం ధర వేలల్లో ఉంటుందట. అవును 2026 గణాంకాల ప్రకారం.. ప్రపంచంలోనే స్విట్జర్లాండ్‌లో కోడి మాంసం ధర అత్యధికంగా ఉందట. అక్కడ కేజీ చికెన్ ధర సుమారు 15 నుండి 30 డాలర్ల వరకు ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 1,200 నుండి 2,500 అన్నమాట.

అక్కడ ఎందుకు చికెన్‌కు అంత రేటు?

స్విట్జర్లాండ్‌లో చికెన్ ధరలు అంత ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణాలు ఏంటనే విషయానికి వస్తే.. అక్కడ జంతు సంక్షేమ చట్టాలు ప్రకారం.. కోళ్లను చిన్న పంజరాల్లో ఉంచడం నిషిద్ధం. కచ్చితంగా వాటికి స్వేచ్ఛగా తిరగడానికి తగినంత స్థలం కల్పించాలి. కోళ్లకు నాణ్యమైన మేత, పరిశుభ్రమైన వాతావరణంలో వాటిని పెంచాలి. దీంతో వాటిని పెంపకానికి ఖర్చు భారీగా అవుతుంది. అక్కడ కోళ్ల ఫామ్‌లలో పని చేసే కార్మికలెల జీతాలు, పామ్ నిర్వహణ వ్యయం ఇతర దేశాలతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటుందట. అలాగే విదేశాల నుండి వచ్చే చౌక రకం చికెన్‌పై స్విస్ ప్రభుత్వం భారీగా పన్నులు విధిస్తుందట. ఈ ఖర్చులన్నింటినీ వినియోగదారులే భరించాల్సి ఉంటుంది కాబట్టి వాళ్లు అధిక ధరలకు మాంసాన్ని విక్రయిస్తారట.

ఇతర దేశాల్లో

కేవలం స్విట్జర్లాండ్ మాత్రమే కాదు, నార్వే, ఐస్‌లాండ్, జర్మనీ వంటి యూరోపియన్ దేశాలలో కూడా కోడి మాంసం ధరలు అధికంగా ఉన్నాయట. మొత్తం మీద, చికెన్ ధరలు కేవలం మార్కెట్ డిమాండ్‌పైనే కాకుండా, ప్రభుత్వ నిబంధనలు, జీవన వ్యయం , వ్యవసాయ విధానాలు వంటి అనేక అంశాలపై కూడా ఆధారపడి ఉంటాయి. అందుకే ఒక దేశంలో చౌకగా దొరికే చికెన్, మరో దేశంలో ఎక్కవ ధరకు లభిస్తుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.