అక్షర దోషాలు: నకిలీ ప్యాకెట్లపై బ్రాండ్ పేర్లు ఎప్పుడూ తప్పుగా ఉంటాయి. కోల్గేట్ వంటి ప్రముఖ బ్రాండ్ల “Distributed by Colgate-Palmolive అని స్పష్టంగా ముద్రించి ఉంటాయి. ఒక వేళ అందులో స్పెల్లింగ్ మిస్టెక్స్ ఉంచే కచ్చితంగా అది నకిలీ ఫేస్ట్ అని అర్థం. అసలైన బ్రాండ్ ప్యాకింగ్ ఎప్పుడూ చాలా స్పష్టంగా, ప్రీమియం లుక్‌తో ఉంటుంది. రంగులు వెలిసిపోయినట్లున్నా లేదా అక్షరాలు మసకగా ఉన్నా అది నకిలీ అయ్యే అవకాశం ఉంది. అలాగే ప్యాకెట్ వెనుక తయారీదారు పేరు, చిరునామా సరిగ్గా ఉన్నాయో లేదో కూడా చూడండి.
బార్కోడ్ తనిఖీ చేయండి: ప్రతి ప్రముఖ బ్రాండ్‌కు ఒక ప్రత్యేకమైన బార్కోడ్ ఉంటుంది. ఉదాహరణకు, కోల్గేట్ ఉత్పత్తుల బార్కోడ్ సాధారణంగా 35000 తో ప్రారంభమవుతుంది. నకిలీ బ్రాండ్స్‌కు మరోలా ఉండవచ్చు. కాబట్టి మీ దగ్గర ఉన్న పేస్ట్ బార్కోడ్ స్కానర్ యాప్ ద్వారా దాన్ని స్కాన్ చేసి వివరాలు సరిచూసుకోండి.
కలర్ మార్క్ : టూత్‌పేస్ట్ ట్యూబ్ అడుగున ఉండే పచ్చ, ఎరుపు లేదా నలుపు రంగు చారలు అది సహజమైనదా లేక కెమికల్స్‌తో తయారు చేసినదా అనే విషయాన్ని తెలపవు. ఇది కేవలం ట్యూబ్‌లను కత్తిరించడానికి, సీల్ చేయడానికి యంత్రాలు ఉపయోగించే ఐ మార్క్ మాత్రమే. దీన్ని బట్టి నాణ్యతను అంచనా వేయకండి.
కొనుగోలు చేసే ప్లేస్: గల్లీల్లో ఉండే షాప్‌లలో, అనధికారిక ఆన్లైన్ సైట్లలో అతి తక్కువ ధరకు వస్తున్నాయని టూత్‌పేస్ట్‌లను ఎప్పుడూ కొనకండి. నమ్మకమైన సూపర్మార్కెట్లు, ఫార్మసీలు లేదా అధికారిక బ్రాండ్ వెబ్సైట్ల నుంచే కొనుగోలు చేయడం సురక్షితం.
రుచి: ఒకవేళ మీరు పేస్ట్ వాడుతున్నప్పుడు దాని రుచి వింతగా ఉన్నా, నురుగు సరిగ్గా రాకపోయినా, లేదా చిగుళ్లలో మంట, నొప్పి కలిగినా వెంటనే వాడటం ఆపేయండి. అలాగే ప్యాకెట్‌పై ఉన్న హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి బ్యాచ్ నంబర్‌ను వెరిఫై చేయండి. నకిలీ టూత్‌పేస్ట్‌లలో హానికరమైన రసాయనాలు ఉండవచ్చు. ఇవి మీ పళ్లకు మాత్రమే కాకుండా, మీ మొత్తం ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయి. కాబట్టి తక్కువ ధర కంటే నాణ్యతకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.




