కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు తురిమిన కొబ్బరి, అర కప్పు తురిమిన క్యారెట్, ఒక కప్పు మామిడి కాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్లు నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, కరివేపాకు ఆకులు, రెండు ఎండు మిర్చిని తీసుకోవాలి.
ముందుగా తురిమిన కొబ్బరి, క్యారెట్, మామిడిని తీసుకుని ఒక గిన్నెలో మంచిగా కలుపుకోవాలి. రెండు పచ్చిమిర్చి, నాలుగు వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
అయితే, మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసి తింటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పాన్ తీసుకుని నూనెను తీసుకుని దానిలో వేడి చేసి కొద్దిగా ఆవాలు, జీలకర్రను వేసి బాగా వేయించాలి.
ఆ తర్వాత రెండు ఎండు మిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు ఆకులు వేసి పోపు పెట్టుకోవాలి. ఈ పోపును మిక్సీ పట్టుకున్న పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి.
అంతే, వేడి వేడి మామిడికాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతోంది. ఇంకా దీనిలో నెయ్యి వేసుకుని తింటే ఆ రుచి వేరు. ఇంకా ఇడ్లీ, దోసెల్లోకి టేస్టీగా ఉంటుంది.




