
Austria Victory: ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అడుగుపెట్టిన ఆస్ట్రియా జట్టు.. తమ రిటర్న్ మ్యాచ్‌లోనే అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో దుమ్ములేపింది. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా స్టేడియంలో తొలిసారి వరల్డ్ కప్ ఆడుతున్న జోర్డాన్ (Jordan) జట్టుతో జరిగిన హోరాహోరీ పోరులో ఆస్ట్రియా 3–1తో ఘన విజయం సాధించింది. రోమనో స్మిడ్ కొట్టిన సూపర్ గోల్, జోర్డాన్ డిఫెండర్ చేసిన ఓన్ గోల్, చివర్లో మార్కో అర్నాటోవిక్ పెనాల్టీ గోల్‌తో ఆస్ట్రియా మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
ఆస్ట్రియా మ్యాచ్ అంటేనే నో బోర్:
ఈ మ్యాచ్‌తో ఆస్ట్రియా ఖాతాలో ఒక ఇంట్రెస్టింగ్ రికార్డ్ చేరింది. ఆస్ట్రియా జట్టు ఇప్పటి వరకు వరల్డ్ కప్ హిస్టరీలో మొత్తం 30 మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఒక్క మ్యాచ్ కూడా ‘గోల్‌లెస్’ (0–0) గా ముగియలేదు. అంటే ఆస్ట్రియా మ్యాచ్ ఉందంటే గ్రౌండ్‌లో గోల్స్ పడాల్సిందే, ఫ్యాన్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ గ్యారెంటీ అన్నమాట!
జోర్డాన్ స్టార్టింగ్ సూపర్.. ఆస్ట్రియా లీడ్:
* జోర్డాన్ ఎటాక్: మ్యాచ్ స్టార్ట్ అయిన 2వ నిమిషంలోనే జోర్డాన్ కెప్టెన్ ఎహ్సాన్ హద్దాద్‌కి ఒక హాఫ్- ఛాన్స్ దొరికినా బంతిని సైడ్-నెట్‌కు కొట్టేశాడు. ఆ తర్వాత ఓదే ఫఖౌరి దూరం నుంచి కొట్టిన మరో సాలిడ్ షాట్‌ను ఆస్ట్రియా కీపర్ అలెగ్జాండర్ ష్లేగర్ అద్భుతంగా అడ్డుకున్నాడు.
* ఆస్ట్రియా ఫస్ట్ గోల్: జోర్డాన్ కంగారు పెడుతున్న టైమ్‌లోనే.. మ్యాచ్ 20వ నిమిషంలో ఆస్ట్రియా ప్లేయర్ రోమనో స్మిడ్ బాక్స్ వెలుపల నుంచి ఎవరూ అడ్డుకోలేని రేంజ్‌లో ఒక బుల్లెట్ లాంటి షాట్‌తో బంతిని నెట్‌లోకి పంపి ఆస్ట్రియాకు 1–1తో సమం అయింది.
జోర్డాన్ హిస్టారికల్ గోల్.. ఆ తర్వాత VAR డ్రామా:
సెకండ్ హాఫ్ మొదలైన 5 నిమిషాలకే జోర్డాన్ ప్లేయర్ అలీ ఓల్వాన్ ఒక మైండ్ బ్లోయింగ్ సోలో గోల్‌తో స్కోరును సమం చేశాడు. వరల్డ్ కప్ హిస్టరీలో జోర్డాన్ దేశం తరఫున గోల్ కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా అలీ ఓల్వాన్ చరిత్ర సృష్టించాడు.
VARలో మరో ట్విస్ట్: మ్యాచ్ 67వ నిమిషంలో ఆస్ట్రియా సీనియర్ ప్లేయర్ మార్కో అర్నాటోవిక్ గోల్ కొట్టి టీమ్‌ను లీడ్‌లోకి తీసుకెళ్లాడు. కానీ లక్ కలిసి రాలేదు.. ఆన్-ఫీల్డ్ అంపైర్ ‘VAR’ (Video Assistant Referee) రివ్యూ చెక్ చేసి.. బిల్డప్‌లో స్టీఫన్ పోష్ చేతికి బంతి తగిలిందని (Handball) ఆ గోల్‌ను క్యాన్సిల్ చేశాడు.
అర్నాటోవిక్ మాస్ ఫినిషింగ్:
గోల్ క్యాన్సిల్ అయినా ఆస్ట్రియా అస్సలు తగ్గలేదు. కొద్దిసేపటికే కార్నర్ బాల్‌ను క్లియర్ చేసే ప్రాసెస్‌లో జోర్డాన్ డిఫెండర్ యాజన్ అల్ అరబ్ దురదృష్టవశాత్తూ హెడ్‌తో తన సొంత నెట్‌లోనే ఓన్ గోల్ (Own Goal) వేసుకుని ఆస్ట్రియాకు మళ్లీ లీడ్ ఇచ్చేశాడు. ఇక మ్యాచ్ ముగుస్తుందనగా.. ఇంజూరీ టైమ్ 12వ నిమిషంలో లభించిన పెనాల్టీని మార్కో అర్నాటోవిక్ క్లాస్‌గా గోల్ చేసి ఆస్ట్రియాకు 3–1తో అదిరిపోయే విక్టరీని ఖరారు చేశాడు.
Romano Schmid przepięknym trafieniem wyprowadza Austrię na prowadzenie w meczu z Jordanią 😮💨
🔴 TRANSMISJA ➡️ https://t.co/GYjzq0v8NV pic.twitter.com/M41wNKsbaf
— TVP SPORT (@sport_tvppl) June 17, 2026
Austria 0-0 Jordan
Stefan Posch shields the ball from Mohannad Abu Taha
Bayern star Konrad Laimer is penalised for handball following his landing on it in the penalty area.
A full stadium for the nightcap
There is no grand tactical plan that will set the World Cup alight… pic.twitter.com/dPajX7g3XR
— Lilian Chan (@bestgug) June 17, 2026
Jordan have their first-ever World Cup goal… and what a goal it is. 🇯🇴✨
Ali Olwan picks up the ball near midfield, drives through the heart of Austria’s defense, and guides a finish off the post and in.
Game on.#WorldCup | #FIFAWorldCup | #Jordan pic.twitter.com/JjSOH9x5xz
— DAZN Football (@DAZNFootball) June 17, 2026