
ప్రపంచంలోనే నెం.1 యూట్యూబర్‌గా మిస్టర్ బీస్ట్ కి పేరుంది. జూన్ 12, 2026న, మిస్టర్‌బీస్ట్ తన అధికారిక యూట్యూబ్ ఛానల్ లైవ్‌లో ఉన్న సమయంలో 50కోట్ల సబ్‌స్క్రైబర్ల మార్క్‌ను చేరుకున్నాడు. యూట్యూబ్ చరిత్రలో ఇది మరో మైలురాయి. ఫిబ్రవరి 2012లో తన యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించాడు. అప్పుడు అతడి వయసు 13 ఏళ్లు. 2017లో అతడు అంకెలను లక్ష వరకు లెక్కపెడుతూ చేసిన వీడియోను చాలా మంది చూసారు. 312 మిలియన్ తో T-Series, 201 మిలియన్ సబ్‌స్క్రైబర్లతో Cocomelon తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మిస్టర్ బీస్ట్ అసలు పేరు జేమ్స్ డోనాల్డ్‌సన్. అతడు తన ‘బీస్ట్ ఫిలాంత్రపీ’ ఛానల్ పై వచ్చే మొత్తం ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తుంటాడు. చెట్లను నాటడం, సముద్రాల శుభ్రత, పేదలకు ఇళ్లు, ఆహారం అందించే ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తుంటాడు. బాలకార్మికులుగా పనిచేస్తున్న పిల్లలకు విముక్తి కలిగించడంతోపాటు… ‘లైట్ ఏఐ’ అనే ప్రాజెక్ట్‌ని మొదలుపెట్టి స్మార్ట్‌ఫోన్, ఏఐ పరిజ్ఞానంతో టెస్టులు చేయిస్తూ అవసరం అయిన వారికి చికిత్సలూ చేయిస్తున్నాడు. ‘ఘనా మేక్ ఎ డిఫరెన్స్’ అనే ఎన్జీవోతో కలిసి గుండెజబ్బులున్న పిల్లలకు ఆపరేషనలు చేసేందుకు వీలుగా సర్జికల్ సెంటర్‌నీ ప్రారంభించాడు. కెన్యా, జింబాబ్వే, ఉగాండా ప్రాంతాల్లోని పిల్లలకు మంచినీరు అందించడం కోసం వంద బావులు తవ్వించాడు. వీటన్నిటి వీడియోలను ఆయన యూట్యూబ్‌లో పంచుకుంటాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మిస్టర్ బీస్ట్‌ను అభిమానిస్తారు. విజయం గురించి మిస్టర్ బీస్ట్ స్వయంగా లైవ్‌లో మాట్లాడాడు. తను చిన్నప్పుడు ఎక్కువ సౌకర్యాలు లేకుండా పెరిగాననీ ఛానల్ మొదలుపెట్టినప్పుడు దానికి అవసరమైన సామగ్రిని కొనడానికి కూడా డబ్బు లేదని అని భావోద్వేగంగా చెప్పాడు. ఈ విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మిస్టర్ బీస్ట్ వీడియోలు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కే కాకుండా, సానుకూల సందేశాలు, సవాళ్లు, భారీ ప్రైజ్ మనీతో నిండి ఉంటాయి. ఆయన బీస్ట్ గేమ్స్ వంటి షోలు పాపులరయ్యాయి. ఈ 500 మిలియన్ మైలురాయి సందర్భంగా ఆయన ఒక కొత్త వీడియోను టీజ్ చేశాడు. ఇది యూట్యూబ్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తోంది. అతని ఛానెల్ వ్యూస్ 129 బిలియన్లు దాటాయి. ఈ విజయం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇండియాలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు. కష్టపడి పై కొచ్చి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. మిస్టర్ బీస్ట్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆస్తులు పంచి.. అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి.. కుటుంబం ఆత్మహత్య
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్ ఫాస్ట్ స్కీం నేటి నుంచే!
కార్పొరేట్ లుక్‌లో సర్కారు బడులు.. విద్యార్థులకు సరికొత్త యూనిఫాంలు..
Brazil : ప్రాణం తీసిన బంగీజంప్.. ఏం జరిగిందంటే..
అల్లు అర్జున్ ఎఫెక్ట్.. AA23 థీమ్ మ్యూజిక్‌ను ఉపయోగించిన.. ప్రధాని నరేంద్ర మోడి