
ఎప్పుడు బయటకు వెళ్లినా అందంగా కనపడాలని రకరకాల మేకప్ లు వాడుతుంటారు అయితే సీజన్‌కు తగ్గట్టు మేకప్ మార్చాలి. లేదంటే వేసుకున్నా లాభం ఉండదు. మేకప్ ప్రొడక్ట్స్ ని కూడా సీజన్ కి తగ్గట్టు సెలక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రైనీ సీజన్ లో మేకప్ ఎలా ఉండాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !
- చాలామంది వర్షాకాలంలో రెగ్యులర్ మేకప్ నే ఫాలో అవుతుంటారు. కానీ, ఈ కాలంలో వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకోవాలి. ఐషాడో నుంచి లిప్ స్టిక్ వరకు అన్ని రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాటర్ ప్రూఫ్ దొరుకుతున్నాయి. ఇవి వేసుకుంటే వర్షంలో తడిసినా మేకప్ పోదు. అలాగే ఇప్పుడు ఫౌండేషన్ వేసుకోకపోవడమే మంచిది. కావాలంటే సిలికాన్ బేస్డ్ వాటర్ ప్రూఫ్, మ్యాటీ. ఫినిష్ ప్రైమర్ ఫౌండేషన్స్ వాడొచ్చు.
- వర్షాకాలంలో క్రీమీ బేస్డ్ ఫౌండేషన్, బ్లష్ ఐ-షాడోలు వద్దే వద్దు. స్టిక్కీ, ముదురురంగు లిప్ స్టిక్స్ జోలికి
- వెళ్లకపోవడమే మంచిది. క్రీమీ లిప్ స్టిక్స్, లిప్ బామ్స్ బెస్ట్ ఆప్షన్. అలాగే పెదవులకు సాఫ్ట్ బ్రౌన్, పింక్ లిప్ స్టిక్స్ బాగా నప్పుతాయి.
- ఎండాకాలం మాత్రమే కాదు, వర్షాకాలంలోనూ సన్ స్క్రీన్ ప్రొటక్షన్ అవసరం. మాయిశ్చరైజర్ కూడా తప్పనిసరి. అయితే వాటర్ బేస్డ్ లేదా వాటర్ ప్రూఫ్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ లోషన్స్ ఎంచుకోవాలి. చర్మాన్ని ఎప్పటికప్పుడు క్లెన్సింగ్ చేసుకోవాలి. ఒకవేళ చర్మం జిడ్డుగా అవుతుంటే ముల్తానీ మట్టిలో కొంచెం రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించాలి.
- వర్షాకాలంలో తడి జుట్టుని అలానే వదిలేస్తే లేనిపోని చిక్కులు వచ్చి పడతాయ్. అందుకే వర్షంలో తడిసిన ప్రతిసారి మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. హెర్బల్ షాంపూలు వాడటం మరీ మంచిది. అలాగే ఈ కాలంలో హెయిర్ స్ప్రేలు, జెల్లు, బ్లో డ్రయర్స్ వాడొద్దు. వర్షానికి వెంట్రుకల కుదుళ్లు పాడవకుండా ఉండాలంటే డీప్ ఫ్రీజ్ సీరమ్‌లను వాడాలి. ఈ సీజన్లో హెయిర్ స్టయిల్ ను సింపుల్ గా చేసుకోవాలి.
- వర్షాకాలంలో ఐ-మేకప్ కు దూరంగా ఉండటమే బెటర్. ఎందుకంటే వర్షంలో తడిస్తే మేకప్ కళ్లలోకి కారుతుంది. కాజల్, ఐబ్రో పెన్సిల్స్ ముఖానికి పెచ్చుల్లా అంటుకుంటాయి. అందుకే ఐ-లైనర్ ఒక్కటి వాడితే సరిపోతుంది. అది కూడా వాటర్ ప్రూఫ్ దే అయి ఉండాలి.
- వర్షంలో చెప్పులు లేకుండా నడవడం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు, అలర్జీలు వస్తాయి. అందుకే చెప్పులు వేసుకోవడం తప్పనిసరి. ఒకవేళ కాళ్లు వర్షానికి తడిస్తే ప్యూమిక్ స్టోన్ తో పాదాలు శుభ్రం చేయాలి. అలాగే లెదర్, కాలిని మొత్తం కప్పి ఉంచే చెప్పులు, షూస్ వేసుకోవద్దు. వీలైనంత వరకు ఈ కాలం సాక్సులు వేసుకోకపోవడమే మంచిది.