Reading Time: 2 minutes

దంచికొట్టిన గిల్, ఇషాన్.. ఆఫ్ఘన్ ముందు 403 పరుగుల టార్గెట్

Caption of Image.

India vs Afghanistan: లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు నెక్స్ట్ లెవెల్ పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టేశారు. ఆఫ్ఘన్ బౌలర్లను ఊచకోత కోస్తూ గ్రౌండ్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (154), యంగ్ సెన్సేషన్ ఇషాన్ కిషన్(125) సెంచరీల విధ్వంసంతో, భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించింది.

గిల్-ఇషాన్ దండయాత్ర: 
టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్‌కు మొదట్లో అంతా బానే అనిపించినా.. రోహిత్ శర్మ అవుట్ అయ్యాక అసలైన గేమ్ మొదలైంది. అంతకుముందు ఓపెనర్ యశస్వి జైస్వాల్ త్వరగానే వెనుదిరగడం, రోహిత్ శర్మ (48 రన్స్) హాఫ్ సెంచరీకి 2 పరుగుల దూరంలో అవుట్ అవ్వడంతో భారత్ 96 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కాస్త కష్టాల్లో పడింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ కలిసి ఆఫ్ఘన్ బౌలర్లను ఆటాడుకున్నారు. వీరిద్దరూ కలిసి కేవలం 140 బంతుల్లోనే 224 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి, మ్యాచ్‌ను పూర్తిగా ఇండియా గుప్పెట్లోకి తెచ్చారు.

సెంచరీల వర్షం.. రికార్డుల మోత: 
ఈ మ్యాచ్‌లో మనోళ్లు ఆడిన తీరు చూస్తుంటే ఆఫ్ఘన్ బౌలర్లకు దడ పుట్టాల్సిందే. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 110 బంతుల్లో 154 పరుగులు చేసి ఏక్ దమ్ క్లాస్ అండ్ మాస్ ఇన్నింగ్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. మరో ఎండ్‌లో ఇషాన్ కిషన్ వన్డేని కాస్తా టీ20లా మార్చేసి, కేవలం 79 బంతుల్లోనే 125 రన్స్ కొట్టి అరాచకం సృష్టించాడు. ఈ ఇద్దరు ప్లేయర్లు ఒకే ఓవర్లో తమ సెంచరీలు పూర్తి చేసుకోవడం ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

►ALSO READ | పాకిస్థాన్‌లోనా ఫిఫా వరల్డ్ కప్?.. పాక్ నేత వ్యాఖ్యలకు నవ్వుకుంటున్న నెటిజన్లు

చివర్లో తడబడిన భారత్.. 400+ రన్స్: 
గిల్, ఇషాన్ అవుట్ అయ్యాక, ఇండియా మరింత భారీ స్కోరు సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ శ్రేయస్ అయ్యర్ (26 రన్స్) ఆశించిన స్థాయిలో రాణించలేదు, అలాగే వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ గోల్డెన్ డకౌట్ అవ్వడంతో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో వాషింగ్టన్ సుందర్ కాస్త మెరుపులు మెరిపించినా.. చివరకు 402 పరుగుల వద్ద ఇండియా ఆలౌట్ అయింది. 

ఆఫ్ఘన్ బౌలర్ల పోరాటం
భారీ స్కోరును కంట్రోల్ చేయడానికి ఆఫ్ఘన్ బౌలర్లు శాయశక్తులా ప్రయత్నించారు. ముఖ్యంగా నంగేయలియా ఖరోటి 4 వికెట్లు తీసి టీమిండియాను కట్టడి చేయడంలో మెయిన్ రోల్ ప్లే చేయగా, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 3 వికెట్లతో తన మార్క్ చూపించాడు. 

©️ VIL Media Pvt Ltd.