
India vs Afghanistan: లక్నోలోని ప్రతిష్ఠాత్మక ఏకానా స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు పూనకాలు వచ్చినట్లు చెలరేగిపోతున్నారు. టాప్ ఆర్డర్ ప్లేయర్లు చెలరేగడంతో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ త్వరగానే పెవిలియన్ చేరినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన రోహిత్, గిల్, ఇషాన్ కిషన్ ఆడిన ఆట చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
హాఫ్ సెంచరీ మిస్సయిన హిట్ మ్యాన్:
ఓపెనర్ జైస్వాల్ అవుట్ అయ్యాక మరో ఎండ్ లో ఉన్న రోహిత్ శర్మ ఆఫ్ఘన్ బౌలర్లపై అటాక్ చేస్తూ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.. అయితే దురదృష్టవశాత్తూ హాఫ్ సెంచరీకి కేవలం 2 పరుగుల దూరంలో (48 రన్స్ దగ్గర) ఆఫ్ఘన్ బౌలర్‌కు వికెట్ సమర్పించుకుని నిరాశగా డగౌట్‌కు చేరుకున్నాడు రోహిత్.
కెప్టెన్‌గా గిల్ ‘ఫస్ట్’ సెంచరీ.. 77 బంతుల్లోనే!
రోహిత్ శర్మ అవుట్ అయ్యాక బ్యాటింగ్ బాధ్యతను భుజాన వేసుకున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గ్రౌండ్ నలుమూలలా క్లాస్ షాట్లతో రెచ్చిపోయాడు. కేవలం 77 బంతుల్లోనే 103 రన్స్ చేసి ఆఫ్ఘన్ టీమ్‌కు చుక్కలు చూపించాడు. ఒక క్లాసిక్ బౌండరీ (ఫోర్) తో తన సెంచరీ మార్కును పూర్తి చేసుకున్నాడు. ఇక టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇదే మొదటి అంతర్జాతీయ శతకం కావడం విశేషం.. కాగా, అతను ఓవరాల్ అంతర్జాతీయ కెరీర్‌లో ఇది 21వ సెంచరీ.
►ALSO READ | ఈసారి కప్ పోర్చుగల్‌దే.. రొనాల్డో కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు.. మాజీ ఇంగ్లాండ్ ప్లేయర్ జోస్యం
ఇషాన్ కిషన్ టాప్ గేర్:
మరో ఎండ్‌లో ఇషాన్ కిషన్ కూడా ఆఫ్ఘన్ బౌలర్లను అస్సలు వదల్లేదు, చీల్చి చెండాడుతూ గ్రౌండ్‌లో రచ్చ లేపాడు. ఈ మ్యాచ్‌లో నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ ఏంటంటే.. క్రీజులో ఉన్న గిల్, ఇషాన్ ఇద్దరూ కలిసి ఒకే ఓవర్లోనే తమ తమ సెంచరీలు పూర్తి చేసుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. ఇషాన్ కిషన్ సైతం ఒక పవర్‌ఫుల్ ఫోర్ కొట్టి తన సెంచరీ మార్కును అందుకున్నాడు. కేవలం 71 బంతుల్లోనే 14 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 103 రన్స్ కొట్టి తన అంతర్జాతీయ కెరీర్‌లో 2వ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. కాగా ప్రస్తుతం భారత జట్టు 35 ఓవర్లు ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది.
Shubman Gill in his element ✨
Well played Captain 👏
Updates ▶️ https://t.co/JYJ5l44iJ6#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/pIQdF3MDWn
— BCCI (@BCCI) June 17, 2026
Shubman Gill’s eye-pleasing class 😇
Ishan Kishan’s fearless flair 😎
Another fruitful partnership for #TeamIndia 🤝
Updates ▶️ https://t.co/JYJ5l44iJ6#INDvAFG | @IDFCFIRSTBank | @ShubmanGill | @ishankishan51 pic.twitter.com/AEnf28O0q7
— BCCI (@BCCI) June 17, 2026