
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మినిమమ్ గ్యారెంటీ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే.. అది ఖచ్చితంగా అనిల్ రావిపూడి మాత్రమే అని చెప్పొచ్చు. ఆయన వస్తుందంటే చాలు, థియేటర్లలో నవ్వుల జాతరే. ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఇదే జోష్ తో ఈ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్.. ఇప్పుడు మరో క్రేజీ మల్టీస్టారర్‌తో రచ్చ లేపేందుకు రెడీ అయిపోయారు.
సరికొత్త ఫన్ ఎంటర్‌టైనర్ రెడీ..
విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి సరికొత్త ఫన్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేశారు. ఈ మూవీ జూన్ 18న గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ వేడుకకు చిత్ర యూనిట్‌తో పాటు టాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. వెంకీ-అనిల్ కాంబోలో వస్తోన్న 5వ సినిమా ఇది . ఇక అనిల్ రావిపూడికి ‘పటాస్’ లాంటి డెబ్యూ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన కల్యాణ్ రామ్‌తో ఇది రెండో సినిమా కావడం విశేషం.
టైటిల్ వెనుక అసలు కథ ఇదేనా?
ఈ సినిమా గురించి ఫిలింనగర్‌లో ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ షికారు చేస్తోంది. సంక్రాంతి సెంటిమెంట్‌ను నమ్ముకునే అనిల్.. ఈ చిత్రానికి ఏకంగా ‘జనవరి 13 విడుదల’ అనే వెరైటీ టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. టైటిల్ వింటేనే అనిల్ మార్క్ కామెడీ అండ్ కమర్షియల్ వైబ్స్ క్లియర్‌గా అర్థమవుతున్నాయి. జూన్ 22 నుంచి రెగ్యులర్ షూట్ షురూ కానుంది. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ కంప్లీట్ చేసి, వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపడమే టార్గెట్ గా అనిల్ పెట్టికున్నారు.
ALSO READ : ఒక్క రీల్‌కు రూ.76 లక్షలు..
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తూ గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్ జోడించబోతున్నారు. ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ సాహు గారపాటి, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వెంకీ కామెడీ టైమింగ్, కల్యాణ్ రామ్ యాక్షన్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్.. వెరసి ఈ సంక్రాంతికి థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అంటున్నాయి సినీ వర్గాలు..
The most-awaited GRAND SANKRANTHI ENTERTAINER is all set to begin its journey❤️🔥#VenkyAnil5 – #NKRAR2 Pooja Ceremony Tomorrow, June 18th from 9 AM onwards 💥
Stay tuned for a blast of a beginning 😎
Victory @VenkyMama @NANDAMURIKALYAN @AnilRavipudi @gvprakash @sahugarapati7… pic.twitter.com/cqzVohmjU6
— Shine Screens (@Shine_Screens) June 17, 2026