Reading Time: < 1 minute

ఫిట్ నెస్ : సైక్లింగ్ తో బలంగా తయారవుతారు.. గుండె ఆరోగ్యం పెరుగుతుంది.. ఇంకా బోలెడు లాభాలు

Caption of Image.

సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సైక్లింగ్ మంచి ఎక్సర్సైజ్
దానికోసం ఎక్కువ కష్టపడనక్కర్లేదు. ఏ ఏజ్ వాళ్లయినా ఎంజాయ్ చేస్తూ సైక్లింగ్ చేయొచ్చు. రోజూ కిరాణా షాప్​ కు  లేదా చిన్న చిన్న దూరాలకు వెళ్లేటప్పుడు హాయిగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లొచ్చు. దాంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రోజుకి దాదాపు వందకోట్ల మంది సైక్లింగ్ చేస్తున్నారని ఒక అంచనా.

ఫిట్ నెస్ కోసం…

  • కండరాలకు సైక్లింగ్ మంచి వర్కవుట్.
  • మిగతా స్పోర్ట్స్ పోల్చితే సైక్లింగ్ చాలా ఈజీ. దీనికి ఫిజికల్ గా ఎక్కువ కష్టం ఉండదు.
  • సైక్లింగ్ వల్ల బలంగా తయారవుతారు.
  • స్టామినాతో పాటు ఫిట్ నెస్ వస్తుంది.
  • ఫ్రెండ్ తో  సరదాగా ఎక్కడికైనా సైకిల్ మీద వెళ్తే ఫన్​ తో  పాటు హెల్త్ కూ మంచిది.
  • చిన్న చిన్న దూరాలకు బస్, బైక్ వంటివి వాడకుండా సైకిల్ మీద వెళ్లినా సరిపోతుంది. టైంపాస్ తోపాటు ఎక్సర్సైజ్ కూడా అవుతుంది.

ఆరోగ్యానికి…

  • గుండె ఆరోగ్యానికి సైకిల్ తొక్కడం చాలా మంచిది. సైక్లింగ్ కార్డియో వాస్కులార్ ఫిట్నెస్ ను పెంచుతుంది.
  • యాంగ్జెటీ, డిప్రెషన్ తగ్గిపోతుంది.
  • సైకిల్ తొక్కడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. అంతేకాకుండా కండరాలకు 
  • ఫ్లెక్సిబిలిటీ వస్తుంది.
  • కీళ్లు స్మూత్​ గా  కదలడానికి కూడా సైక్లింగ్ ఉపయోగపడుతుంది.
  • సైక్లింగ్ చేస్తే స్ట్రెస్ లెవల్స్ తగ్గుతాయి. బాడీలో కొవ్వు కరుగుతుంది.
  • కూర్చునే, నిలుచునే పద్ధతిలో మార్పు వస్తుంది.
  • ఎముకలు బలంగా తయారవుతాయి.
  • రోజూ సైక్లింగ్ చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
  • సైక్లింగ్ చేయడం వల్ల హార్ట్ ఎటాక్, క్యాన్సర్, డయాబెటిస్, ఒబెసిటీ, ఆర్థరైటిస్ వంటి అనారోగ్యాల ముప్పు తప్పుతుంది.

హ్యాండ్ సైక్లింగ్

  • హ్యాండ్​ సైకిల్స్ రికంబెంట్ ట్రైసైకిల్స్ లానే ఉంటాయి. వీటితో కాళ్లకంటే చేతికే పనెక్కువ. అవసరమైనప్పుడు వెల్కోస్ట్రాప్స్ అనేవి చేతికి పెడల్స్ లాగా ఉపయోగపడతాయి.
  • స్ప్రై నల్ ఇంజ్యూరీ అయినవాళ్లు కోలుకోవడానికి హ్యాండ్ సైక్లింగ్ పనికొస్తుంది.అంతేకాకుండా గుండె సంబంధిత, ఏరోబిక్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి..
©️ VIL Media Pvt Ltd.