Reading Time: 2 minutes
Revanth Reddy Health Sector Aarogyasri Limit Increase Telangana

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థపై కీలక ప్రసంగం చేశారు. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన ఆర్థిక భారాలను మోస్తూనే, పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలు, సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) దుర్వినియోగం, నూతన బీమా పథకాలపై ఆయన సభలో గణాంకాలతో సహా వివరణ ఇచ్చారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందన్న ప్రతిపక్షాల విమర్శలను ముఖ్యమంత్రి తిప్పికొట్టారు. “మేము అధికారంలోకి వచ్చే నాటికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి 627 కోట్ల రూపాయల బకాయిలు వారసత్వంగా వచ్చాయి. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులకు 240 కోట్లు, ప్రైవేటు ఆసుపత్రులకు 360 కోట్ల రూపాయల బాకీ ఉంది. ఆ భారాన్ని మోస్తూనే, మేము వచ్చాక ఇప్పటి వరకు ప్రభుత్వ ఆసుపత్రులకు 927 కోట్లు, ప్రైవేటు ఆసుపత్రులకు 1480 కోట్ల రూపాయలను విడుదల చేశాం” అని ఆయన వివరించారు. ప్రస్తుతం రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద నెలకు సగటున 89 కోట్ల నుండి 90 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు.

Vivo T5 Pro: 9,020mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌.. వివో టి5 ప్రో వచ్చేస్తోంది

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచినట్లు సీఎం గుర్తు చేశారు. ఇది చాలదన్నట్టుగా, రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు ధీమా కల్పించేందుకు నూతనంగా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఒకవేళ కుటుంబ పెద్దను కోల్పోతే, ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నిధులు విపరీతంగా దుర్వినియోగం అయ్యాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. “సీఎంఆర్ఎఫ్ నిధుల చెక్కులను కొందరు పీఏలు అక్రమంగా కాజేశారని, దీనిపై ఇప్పటికే కేసులు నమోదై అరెస్టులు జరుగుతున్నాయి. మేము వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 2040 కోట్ల రూపాయలను పారదర్శకంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించాం” అని వెల్లడించారు.

ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రుల పనితీరుపై కూడా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. “టీచింగ్ కాలేజీల్లో నిపుణులైన వైద్యులు ఉన్నప్పటికీ, పేషెంట్లు అక్కడికి వెళ్లడం లేదనే విషయాన్ని గమనించాం. పేషెంట్లకు ప్రొఫెషనల్ ట్రీట్మెంట్ అందేలా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. సూపరింటెండెంట్లకు అదనపు బాధ్యతలు అప్పగించి, ఆసుపత్రుల నిర్వహణను మెరుగుపరుస్తాం” అని ఆయన పేర్కొన్నారు.

Lavanya Drunk Driving Case: నేను సెలబ్రిటీని, నన్నెవడ్రా ఆపేది.. మద్యం మత్తులో లావణ్య హంగామా!