Reading Time: < 1 minute
Shocking Murder In Nandyal Wife And Lover Kill Husband Police Uncover The Truth After Investigation

Nandyal Mu*rder: నంద్యాలలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడు ఇలియాస్ తో కలిసి భర్త అరిఫ్ ను దారుణంగా హత్య చేసింది భార్య.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పట్టణ శివారులోని నంద్యాల కర్నూలు బైపాస్ రోడ్డు కుందూనదిలో అనుమానాస్పద స్థితిలో 4 రోజుల క్రితం లభ్యమైన అరిఫ్ మృతదేహం వాస్తవానికి హత్య కావొచ్చు.. అతని భార్య చెప్పిన ఆత్మహత్య కథనం అసత్యమని పోలీసులకు అనుమానం వచ్చింది..

Read Also: Modi-Sonia Gandhi: ఒకే ఫ్రేమ్‌లో మోడీ-సోనియాగాంధీ.. ఫొటో వైరల్

అయితే, మద్యం అతిగా తాగినందుకు తన భర్తను మందలించాను, అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడని భర్త మృతిపై పోలీసులకు వివరణ ఇచ్చింది భార్య.. కానీ, అరిఫ్ సోదరి ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో హత్య జరిగినట్లు వివరణలు వెలుగులోకి వచ్చాయి. కాగా, నూనెపల్లెకు చెందిన పెయింటర్ అరిఫ్ కి నిందితురాలైన మహిళతో 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కానీ, ఆమె.. ఇలియాస్ (అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి) మధ్య మద్య వివాహేతర సంబంధం ఏర్పడింది.. అరిఫ్ ను అడ్డుకోడానికి ఇలియాస్ కలిసి ప్లాన్ చేసింది భార్య.. ప్లాన్‌లో భాగంగా అరిఫ్ కు అధికంగా మద్యం తాగించి, కొట్టి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత అరిఫ్ మృతదేహాన్ని కుందూ నదిలో విసిరేశారు, తద్వారా ఆత్మహత్య గా చిత్రీకరించటానికి ప్రయత్నించారు. అయితే, మృతదేహంపై గాయాలు గుర్తించిన రెహనా ఫిర్యాదుతో లోతుగా దర్యాప్తు చేసిన త్రీ టౌన్ పోలీసులు అసలు వాస్తవాన్ని వెల్లడించారు.. పోలీసుల విచారణలో అసలు విషయాన్ని అంగీకరించింది నిందితురాలు.. భార్య, ప్రియుడితో పాటు.. వారికి సహకరించిన మరో వ్యక్తిని కూడా నంద్యాల త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు..