
అతడు పోలీస్.. ఒక మహిళతో నాలుగేళ్లు లిన్ ఇన్ రిలేషన్ లో ఉన్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా పరిచయం చేశాడు. చివరికి మరో పెళ్లికి సిద్ధమవటంతో మనస్థాపానికి గురైన మహిళ సూసైడ్ చేసుకున్న ఘటన ఆగ్రాలో కలకలం రేపింది. సూసైడ్ కు ముందు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జేవీ గౌతమ్ అనే పోలీస్ కానిస్టేబుల్ తాజ్ గంజ్ స్టేషన్ లో పనిచేస్తున్నాడు. నాలుగేళ్లుగా తనతో రిలేషన్ లో ఉన్నాడని.. తనను ఒక భార్యలాగే నమ్మించి.. పెళ్లి చేసుకుంటానని చెప్పి చివరికి మోసం చేశాడని మహిళ వీడియోలో పేర్కొంది. తన చావుకి కారణం గౌతమ్ తో పాటు అతని కుటుంబ సభ్యులేనని చెబుతూ పీఎం మోదీ, సీఎం యోగి ఆదిత్యానాథ్ కి లేఖ రాసింది మహిళ. తనను మానసికంగా, శారీరకంగా వేధించినట్లు మహిళ పేర్కొంది. ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ కు వెళితే తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
తనను పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకోరని కానిస్టేబుల్ చెప్పినట్లు మహిళ పేర్కొంది. గౌతమ్ తో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా టార్చర్ చేశారని.. చివరికి తనకు ఈ గతి పట్టించారంటూ కన్నీరుమున్నీరైంది.
గౌతమ్ పెద్దన్న.. పెళ్లి చేసుకొమ్మని చెప్పాడు. కానీ ఫ్యామిలీ ఒప్పుకోదని గౌతమ్ చెప్పాడు. పెళ్లి చేసుకోకపోయినా సరే కానీ.. మరో అమ్మాయిని మోసం చేయొద్దని నేను చెప్తున్నాను.. అంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది మహిళ.
ప్రాథమకి విచారణ ప్రకారం.. మహిళ స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని కాస్గంజ్ జిల్లా. గతంలో మరో వ్యక్తితో విడాకులు కాగా.. ఆగ్రాలో ప్రైవేట్ జాబ్ చేస్తూ ఒంటరిగా బతుకుతూ వస్తోంది. నాలుగేళ్ల క్రితం కానిస్టేబుల్ గౌతమ్ పరిచయం ప్రేమగా మారి.. ఇద్దరూ కలిసి ఉంటున్నారు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. కానీ ఉన్నట్లుండి గౌతమ్ మరో పెళ్లికి సిద్ధమవటంతో మహిళ ఆత్మహత్య చేసుకుంది.
ALSO READ : ఇడ్లీ నుంచి పరోటా వరకు.. అన్నింటిపైనా 10 రూపాయలు పెంచిన హైదరాబాద్ హోటళ్లు
మహిళ వీడియోలు వైరల్ గా మారటంతో కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు పై అధికారులు. మహిళ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మహిళ మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకుని.. కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.
“Don’t get married to anyone, but don’t keep any girl in deception either”
The young woman who made a video before suicide in Agra leveled serious allegations of deception against police constable Jitendra Gautam!!
Constable is arrested and send to Jail.
99 percent of Live in… pic.twitter.com/OCDlXiEbLb
— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) March 13, 2026