July 10, 2026

Monalisa Got Married: ఇంట్లో నుంచి పారిపోయి.. ప్రేమ పెళ్లి చేసుకున్న మోనాలిసా.. వీడియో వైరల్

Monalisa Got Married: ఇంట్లో నుంచి పారిపోయి.. ప్రేమ పెళ్లి చేసుకున్న మోనాలిసా.. వీడియో వైరల్
Reading Time: < 1 minute
Monalisa Got Married To Her Boyfriend Farman Khan In Grand Ceremony In Kerala

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహా కుంభమేళాలో పూసలు అమ్ముకునే యువతి మోనాలిసా గుర్తుందా? తన మత్తెక్కించే కళ్లతో.. సోయగంతో కుర్రాళ్ల మదిని దోచేసింది. పుణ్యాస్నానాలకు వెళ్లిన యువకుల్లో కొందరు మోనాలిసా ఫోటలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో ఫేమస్ అయిపోయింది. ఎంతలా అంటే ఓ సెలబ్రిటీ రేంజ్ లో. దీంతో అమ్మడికి సినిమా ఛాన్సులు కూడా వచ్చాయి. పలు సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఇదిలా ఉంటే మరోసారి వార్తల్లో నిలిచింది మోనాలిసా.. ఈ కానీ, ఈసారి సినిమాలకు సంబంధించి కాదు.. తన ప్రేమ విషయంలో.

Also Read:Gas Booking Scam : ఫాస్ట్ డెలివరీ అంటూ కేటుగాళ్ల ‘గ్యాస్ బుకింగ్’ లింక్.. క్లిక్ చేస్తే మీ అకౌంట్ ఖాళీ..!

పూసలమ్మే మోనాలిసా ప్రేమ పెళ్లి చేసుకుంది. కుంభమేళా లో పూసలు అమ్ముకుని ఫేమస్ అయిన మోనాలిసా ఇంట్లో నుంచి పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకుంది. మోనాలిసా తన ప్రియుడు ఫర్మణ్ ఖాన్ కేరళలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కులాలకు, మతాలకు అతీతంగా హిందూ సంప్రదాయం లో పెళ్లి చేసుకున్నారు. వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింటా వైరల్ గా మారాయి. అనంతరం తన తండ్రి నుంచి ప్రాణ హాని ఉందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

మోనాలిసా ప్రేమ విషయానికి వస్తే.. మధ్య ప్రదేశ్ యువకుడితో ఏడాదిన్నరగా ప్రేమాయణం సాగిస్తోంది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఫర్మాన్ ఖాన్ తో డేటింగ్ చేస్తోంది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న లవ్ బర్డ్స్ ఇంట్లో చెప్పారు. అయితే మోనాలిసా తల్లిదండ్రులు ప్రేమ పెళ్లిని తిరస్కరించారు. దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మోనాలిసా ప్రియుడితో కలిసి తిరువనంతపురం లోని పోలీసు స్టేషన్ కు చేరుకుంది. తండ్రి నుండి తనకు ప్రాణ భయం ఉందంటూ పోలీసులను ఆశ్రయించింది మోనాలిసా. ఆ తర్వాత ఓ దేవాలయంలో మోనాలిసా ప్రియుడు ఫర్మాన్ ఖాన్ ను పెళ్లాడింది.