July 10, 2026

Trump Reliance Deal: సాహో భారత్.. అమెరికా గడ్డపై చరిత్ర సృష్టించిన రిలయన్స్!

Trump Reliance Deal: సాహో భారత్.. అమెరికా గడ్డపై చరిత్ర సృష్టించిన రిలయన్స్!
Reading Time: 2 minutes
Saho Bharat Reliance Usa Oil Refinery Investment Trump Deal Texas

Trump Reliance Deal: అమెరికా ఇంధన చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. గత అర్ధ శతాబ్ద కాలంగా (50 ఏళ్లు) అమెరికాలో ఒక్క కొత్త ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం (Oil Refinery) కూడా నిర్మించలేదు. అయితే, ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టులో భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామి కావడం విశేషం. టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్లేలో ఈ కొత్త రిఫైనరీని నిర్మించనున్నట్లు ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా వెల్లడించారు. దీని విలువ దాదాపు $300 బిలియన్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 25 లక్షల కోట్లకు పైమాటే).

READ ALSO: Rain In Telangana: చల్లని కబురు చెప్పిన తెలంగాణ వాతావరణ శాఖ.. ఈ జిల్లాల్లో వర్షాలే వర్షాలు..

50 ఏళ్లుగా అమెరికా ఎందుకు మౌనంగా ఉందంటే..
ఈ చారిత్రాత్మక పెట్టుబడి పెడుతున్నందుకు భారతదేశానికి, ప్రత్యేకించి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. దీనిని అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందంగా ఆయన అభివర్ణించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో 1977 తర్వాత ఒక్క మేజర్ రిఫైనరీ కూడా ఎందుకు రాలేదో తెలుసా.. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఏంటంటే.. కొత్త ప్లాంట్‌ను నిర్మించడం కంటే, ఉన్న ప్లాంట్‌ల సామర్థ్యాన్ని పెంచడమే లాభదాయకమని అమెరికన్ కంపెనీలు భావించాయి. కొత్త రిఫైనరీని స్థాపించడానికి అమెరికాలో ప్రభుత్వ అనుమతులు పొందడం చాలా క్లిష్టమైన, సుదీర్ఘమైన ప్రక్రియ. రాబోయే కాలంలో గ్యాసోలిన్ (పెట్రోల్) డిమాండ్ తగ్గుతుందని, ప్రపంచం గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లుతుందని కంపెనీలు ఊహించాయి. అందుకే 50 ఏళ్లుగా అమెరికా కొత్త ఆయిల్ రిఫైనరీల వైపు మొగ్గు చూపలేదని విశ్లేషకులు చెబుతున్నారు.

చివరిసారిగా 1977లో లూసియానాలో మారథాన్ ఆయిల్ పెద్ద రిఫైనరీని ప్రారంభించింది. ఆ తర్వాత కేవలం చిన్న చిన్న ప్లాంట్లు మాత్రమే వచ్చాయి. అయితే, 2022లో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి పరిణామాల నేపథ్యంలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని అమెరికా గుర్తించింది. ఈ క్రమంలోనే ట్రంప్ ఈ భారీ ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చారు. రిలయన్స్ వంటి గ్లోబల్ ఎనర్జీ ప్లేయర్ ఈ ప్రాజెక్టులో చేరడం వల్ల అమెరికాలో ఇంధన ధరలు తగ్గడమే కాకుండా, వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇది అటు అమెరికాకు, ఇటు భారతీయ వ్యాపార రంగానికి కొత్త ఊపును తీసుకొచ్చే ఒప్పందంగా మారనుందని చెబుతున్నారు.

READ ALSO: Chota K Naidu: సినిమాకు కులం లేదు: ఛోటా కే.నాయుడు