Reading Time: < 1 minute
Photo Of Dog Appears On Admit Card And This Candidate In Rohtas Bihar Faced Strange Fate

అధికారుల నిర్లక్ష్యం ఓ నిరుద్యోగ అభ్యర్థిని చిక్కుల్లో పడేసింది. ప్యూన్ పోస్టు కోసం అప్లై చేసుకున్న అతనికి తీరా అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోగా తన ఫొటోకు బదులు కుక్క ఫొటో దర్శనమివ్వడంతో కంగుతిన్నాడు. బీహార్‌లోని రోహ్తాస్ లో ఈ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ అభ్యర్థి అడ్మిట్ కార్డులో అతని ఫోటోకు బదులుగా కుక్క ఫోటో ముద్రించారు. ఈ సంఘటన అభ్యర్థిని తీవ్ర కలతకు గురిచేసింది. ఇది మరోసారి నియామక ప్రక్రియ, ఆన్‌లైన్ దరఖాస్తు వ్యవస్థ గురించి ప్రశ్నలను లేవనెత్తింది. నివేదికల ప్రకారం, ఈ సంఘటన బిక్రమ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ధావా గ్రామానికి చెందిన రితేష్ కుమార్‌ కు జరిగింది.

Also Read: Trump Reliance Deal: సాహో భారత్.. అమెరికా గడ్డపై చరిత్ర సృష్టించిన రిలయన్స్!

రితేష్ 2022 లో సివిల్ కోర్టులో ప్యూన్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల నియామక ప్రక్రియ ఆలస్యం కాగా, తాజాగా ఈ నియామక పరీక్షకు అడ్మిట్ కార్డులు జారీ చేశారు. అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకున్న రితేష్ షాక్ అయ్యాడు. అడ్మిట్ కార్డులోని పేరు, ఇతర సమాచారం సరైనవే, కానీ తన ఫోటోకు బదులుగా, కుక్క చిత్రం ముద్రించి ఉండడంతో షాక్ తిన్నాడు.

Also Read:Monalisa: పెద్దలు ఒప్పుకోలేదు కాపాడండి.. కేరళ పోలీస్ స్టేషన్లో ప్రియుడితో మోనాలిసా

ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత రితేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తప్పుకు బోర్డునే కారణమని నిందించాడు. నేను ఈ విషయం గురించి సంబంధిత బోర్డు, విభాగానికి ఫిర్యాదు చేశాను. పరీక్ష రాయడంలో నాకు ఎటువంటి సమస్యలు రాకుండా ఈ తప్పును సరిదిద్దాలని కోరినట్లు తెలిపాడు. సివిల్ కోర్టులో ప్యూన్ పోస్టులకు రాత పరీక్ష మార్చి 15న జరగనుంది. రితేష్ సెంటర్ సహర్సాలో ఉంది. తన అడ్మిట్ కార్డులో ఉన్న ఈ తీవ్రమైన లోపం గురించి రితేష్ ఆందోళన చెందుతున్నాడు. సమయం మించిపోతోందని, ఈ లోపాన్ని వీలైనంత త్వరగా సరిదిద్దకపోతే, పరీక్ష రాయడంలో తనకు ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నాడు.