Reading Time: < 1 minute
Monalisa Bhonsle Kumbh Viral Girl Police Protection Kerala Boyfriend Farman Khan

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన కుంభమేళాలో ఎంతో మంది బాగా సంపాదించుకుని సెటిల్ అయ్యారు. అయితే ఈ కుంభమేళాలో పూసలు అమ్ముతూ వైరల్ అయిన మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా భౌన్స్లే మాత్రం ఒక్కసారిగా తన తేనె కళ్లతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దెబ్బకు ఆమెకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. బాలీవుడ్‌లో ఒక సినిమా మొదలై ఆగిపోగా, తెలుగులో కూడా ఆమెను హీరోయిన్‌గా లాంచ్ చేస్తూ ‘లైఫ్’ అనే సినిమా ప్రారంభమైంది. సాయి చరణ్ హీరోగా ఈ సినిమాను కొద్ది నెలల క్రితమే ప్రారంభించారు.

Also Read :The Paradise: షాకింగ్ లీక్..ది ప్యారడైజ్’లో నాని నేపథ్యం ఇదే!

అయితే ఇప్పుడు మోనాలిసా అనుకోని షాక్ ఇచ్చింది. ఆమె తన ఫేస్‌బుక్ ప్రియుడు కోసం కేరళలోని తిరువనంతపురం చేరుకుంది. తిరువనంతపురంలోని పోలీసు స్టేషన్‌లో కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా ప్రత్యక్షం అయ్యింది. కేరళ యువకుడితో ఏడాదిన్నరగా ప్రేమాయణం సాగిస్తుంది మోనాలిసాకి. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఫర్మాన్ ఖాన్‌తో ఆమె డేటింగ్ చేస్తోంది. అయితే మోనాలిసా ప్రేమను ఆమె తల్లిదండ్రులు తిరస్కరించారు. దీంతో తిరువనంతపురం పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా భౌన్స్లే జంట తమకు రక్షణ కల్పించాలని కోరింది.