Reading Time: < 1 minute
American Airlines Passenger Removed For Playing Loud Videos Without Headphones

బస్సు ప్రయాణమైనా.. విమాన ప్రయాణమైనా తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించనంత వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాని ‘‘నా ఇష్టమొచ్చినట్లు ఉంటానంటే మాత్రం ఊరుకోరు’’. తాజాగా విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలు నానా రచ్చ చేసింది. మొబైల్‌లో పెద్ద ఎత్తున సౌండ్ పొల్యూషన్ చేస్తూ సహా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించింది. హెడ్‌ఫోన్స్ పెట్టుకోమన్న పాపానికి బిగ్గరగా కేకలు వేసింది. చివరికి అర్ధాంతరంగా ప్రయాణాన్ని ముగించుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికా ఎయిర్‌లైన్స్‌లో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Trump-Iran: ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా ప్లాన్ మిస్‌ఫైర్! కారణమిదేనా?

మయామి నుంచి టంపాకు వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఒక మహిళ మొబైల్‌లో పెద్ద ఎత్తున సౌండ్ పెట్టి వీడియో ప్లే చేసింది. దీంతో తోటి ప్రయాణికులు హెడ్‌ఫోన్స్ పెట్టుకోవాలని సూచించారు. కానీ అది ఆమెకు కోపం తెప్పించింది. సహా ప్రయాణికులపై రంకెలు వేసింది. అంతటితో ఆగకుండా పెద్ద ఎత్తున కేకలు వేసి హంగామా సృష్టించింది. దీంతో ఎస్కార్ట్ రంగంలోకి దిగి ఆమెను విమానం నుంచి కిందకు దించేశారు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఒకరు మొబైల్‌లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహిళా ప్రయాణికురాలు మద్యం మత్తులో ఉన్నట్లుగా తెలిపాడు. ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

హెడ్‌ఫోన్‌లు లేకుండా ఆడియో లేదా వీడియోను బిగ్గరగా ప్లే చేసే ప్రయాణీకులపై కఠిన చర్యలు తీసుకుంటామని, విమానం నుంచి తొలగించడం లేదా ఎయిర్‌లైన్‌తో ప్రయాణించకుండా నిషేధం విధించడం వంటి చర్యలు తీసుకుంటామని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ హెచ్చరించిన కొన్ని రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది .