Reading Time: < 1 minute
Actor Rajendra Prasad Controversial Comments On Mgr Sparks Outrage

Rajendra Prasad: టాలీవుడ్ సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘కళాప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు-2025’ ప్రదానోత్సవంలో ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ఒకప్పటి జానపద బ్రహ్మ కాంతారావు గొప్పదనాన్ని వివరించే క్రమంలో, తమిళనాడు ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ (MGR) పట్ల ఆయన వాడిన పదజాలంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

READ ALSO: Suyodhana: రిలీజ్‌కు రెడీ అవుతున్న ప్రియదర్శి కొత్త సినిమా..

అసలేం జరిగిందంటే..
‘కళాప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు-2025’ ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కాంతారావు గొప్పతనం గురించి చెప్తూ ఎంజీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. కాంతారావు నటన చూసి ఎంజీఆర్‌ షాక్‌ అయ్యారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు. జానపదాల్లో కాంతారావు క్రేజ్‌ చూసి ఎంజీఆర్‌ భయపడ్డారన్నారని అన్నారు. “ఎవడ్రా వీడు.. ఇండియన్ సినిమాలను ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాడు అని ఎంజీఆర్ వణికిపోయేవాడు” అంటూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పద్మశ్రీ పురస్కారం పొందిన ఒక బాధ్యతాయుతమైన నటుడు బహిరంగ వేదికపై ఇలాంటి ‘అసభ్య’ పదజాలాన్ని వాడటం రాజేంద్ర ప్రసాద్ సంస్కారానికి తగదని మండిపడుతున్నారు. ఒక గొప్ప నటుడిని పొగిడే క్రమంలో, కోట్లాది మంది ఆరాధించే మరో దిగ్గజ నటుడిని, ప్రజా నాయకుడిని ఇంతలా కించపరచడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు తమిళ చిత్ర పరిశ్రమతో పాటు అక్కడి ప్రజల్లోనూ తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. ఎంజీఆర్ లాంటి మహోన్నత వ్యక్తిని ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన తీరు పట్ల తమిళ తంబీలు సోషల్ మీడియా వేదికగా నిరసన తెలుపుతున్నారు. గతంలోనూ బ్రహ్మానందం, అలీ వంటి తోటి నటులపై రాజేంద్ర ప్రసాద్ ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

READ ALSO: Ashwin: వరల్డ్ కప్ హీరో సంజుపై కోపంగా ఉన్న అశ్విన్.. అసలేం జరిగిందంటే?