Reading Time: 2 minutes
Sanju Samson: కేవలం 25 నిమిషాలే.. సంజూ శాంసన్ కెరీర్‌నే మార్చేసిందిగా.. అదేంటంటే?

సంజూ శాంసన్ (Sanju Samson) టీ20 వరల్డ్ కప్ 2026లో అద్భుత ప్రదర్శన చేసి భారత జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నమెంట్‌లో అతను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. వరల్డ్ కప్ విజయానంతరం తన స్వస్థలమైన తిరువనంతపురం (Thiruvananthapuram )కు చేరుకున్నప్పుడు అభిమానులు అతనికి ఘన స్వాగతం పలికారు.

ఎయిర్‌పోర్ట్ వద్ద వందలాది అభిమానులు “సంజూ… సంజూ…” అంటూ నినాదాలు చేస్తూ అతనిని అభినందించారు. కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్కుట్టి (V. Sivankutty) కూడా అతనికి స్వాగతం పలికారు.

ఫామ్‌కు తిరిగి రావడానికి కొత్త ప్లాన్..

మీడియాతో మాట్లాడిన శాంసన్ తన ఫామ్ తిరిగి రావడానికి తీసుకున్న కొత్త విధానాన్ని వివరించాడు. టీ20 వరల్డ్ కప్‌నకు ముందు న్యూజిలాండ్ (New Zealand) పై జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతను పూర్తిగా విఫలమయ్యాడు. అప్పటివరకు ప్రతి బంతిని భారీ షాట్‌గా ఆడే ప్రయత్నం చేశానని, అది సరైన విధానం కాదని తర్వాత అర్థమైందని చెప్పాడు.

ఆ తర్వాత తన ఆటలో మార్పులు చేసి కొత్త గేమ్ ప్లాన్ రూపొందించానని వెల్లడించాడు. అదే తనకు వరల్డ్ కప్‌లో విజయం సాధించడానికి కీలకంగా మారిందని అన్నాడు.

సచిన్‌తో 25 నిమిషాల ఫోన్ కాల్..

ఈ సమయంలో తనకు సహాయం చేసిన వ్యక్తి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) అని శాంసన్ తెలిపాడు. ఫామ్ పూర్తిగా దెబ్బతిన్న సమయంలో సచిన్‌ను సంప్రదించానని, ఆయనతో దాదాపు 25 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడానని వెల్లడించాడు.

సచిన్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టకాలం, మానసికంగా ఎలా బలంగా ఉండాలి, ప్రాక్టీస్ ఎలా చేయాలి వంటి విషయాలపై విలువైన సలహాలు ఇచ్చారని తెలిపాడు. ఆ సూచనలు తనకు కొత్త ఉత్సాహం ఇచ్చాయని చెప్పాడు.

వరుసగా మూడు కీలక ఇన్నింగ్స్..

టీ20 వరల్డ్ కప్ ప్రారంభంలో శాంసన్ భారత జట్టు మొదటి ఎంపికగా కూడా లేడు. గ్రూప్ స్టేజ్‌లో అతనికి ఒక్క మ్యాచ్ మాత్రమే అవకాశం లభించింది. కానీ తర్వాత జట్టు కాంబినేషన్ మారడంతో అతను మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. ఆ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు.

వెస్టిండీస్‌పై కీలక మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్..

ఇంగ్లాండ్‌పై సెమీఫైనల్‌లో అర్ధశతకంతోపాు ఫైనల్‌లో 89 పరుగులు చేశాడు. మొత్తంగా టోర్నమెంట్‌లో 321 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..