July 9, 2026

Rashmi Gautam: వాళ్లందరితో రిలేషన్స్ ఉంటే ప్రూఫ్ బయటపెట్టు.. నెటిజన్ వల్గర్ కామెంట్స్కి రష్మి గౌతమ్ కౌంటర్

Rashmi Gautam: వాళ్లందరితో రిలేషన్స్ ఉంటే ప్రూఫ్ బయటపెట్టు.. నెటిజన్ వల్గర్ కామెంట్స్కి రష్మి గౌతమ్ కౌంటర్
Reading Time: 2 minutes

Rashmi Gautam: వాళ్లందరితో రిలేషన్స్ ఉంటే ప్రూఫ్ బయటపెట్టు.. నెటిజన్ వల్గర్ కామెంట్స్కి రష్మి గౌతమ్ కౌంటర్

Caption of Image.

యాంకర్‌గా, నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మి గౌతమ్ (Rashmi Gautam) మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ముఖ్యంగా మహిళల హక్కులు, మూగజీవాల రక్షణ వంటి విషయాలపై తరచూ స్పందించే ఆమె, లేటెస్ట్గా తనపై వచ్చిన ఆరోపణలకు ఘాటుగా స్పందించింది.

మహిళా దినోత్సవం సందర్భంగా ఓ నెటిజన్.. రష్మి వ్యక్తిగత జీవితంపై అసభ్య వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ చేశాడు. పాపులర్ షోస్కి వేదికైన మల్లెమాల ప్రొడక్షన్స్‌తో ఆమెకు అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ వ్యాఖ్యలపై రష్మి గౌతమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ సదరు నెటిజన్ని కడిగిపడేసింది. ముందుగా మీ ఆరోపణలకు ఆధారాలు చూపించాలని ఆమె డిమాండ్ చేసింది. తన వ్యక్తిగత జీవితంపై ఇలా దూషించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. ముందు రుజువు చూపించండి. నాకు ఎన్ని సంబంధాలు ఉన్నా అది నా వ్యక్తిగత విషయం. నాపై వేధింపులకు ఎవరికీ హక్కు లేదు. ఎవరితో లింక్ ఉందని అంటారో వారి పేర్లు కూడా ప్రూఫ్‌తో చెప్పండి. ఒకరి క్యారెక్టర్‌ను దెబ్బతీయాలంటే ఇద్దరి పేర్లు చెప్పడం న్యాయం.” అవుతుందని ఆమె పేర్కొంది.

ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేసే నెటిజన్‌కు రష్మి గౌతమ్ ఘాటుగా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం రష్మీ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, చాలామంది నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.

రష్మీ గౌతమ్ తన X(ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ.. “ముందుగా మీ ఆరోపణలకు రుజువులు చూపించండి. రెండోది, నాకు ఎన్ని సంబంధాలు ఉన్నా లేకపోయినా నాపై వేధింపులు చేయడానికి ఎవరికీ హక్కు లేదు. నేను నిన్ను, నీ తండ్రిని లేదా నీ కుమారుడిని వివాహం చేసుకునే వరకు నేను ఎవరితో తిరిగినా అది మీ సమస్య కాదు. అలాగే నాకు ఎవరితో లింక్ ఉందని అంటున్నారో వారి పేర్లను కూడా ప్రూఫ్‌తో సహా చెప్పండి. నా ఒక్క పేరు మాత్రమే ఎందుకు చెబుతున్నారు? ఎవరి క్యారెక్టర్‌ను దెబ్బతీయాలనుకుంటే ఇద్దరి పేర్లు బయటపెట్టడం న్యాయం” అని రష్మి ట్వీట్ చేసింది. 

©️ VIL Media Pvt Ltd.