Reading Time: < 1 minute

కరీంనగర్ డయాగ్నస్టిక్ ల్యాబ్స్ లో తనిఖీలు… షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Caption of Image.

కరీంనగర్ లోని డయాగ్నస్టిక్ ల్యాబ్స్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు TGMC అధికారులు. ఆదివారం ( మార్చి 8 ) చేపట్టిన ఈ తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలు ల్యాబ్స్ లో అర్హత కలిగిన పాథాలజిస్ట్ లు లేకుండానే రిపోర్టులు జారీ చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు.

NABL అక్రెడిటేషన్ ఉన్నట్లు తప్పుడు ప్రకటనలు చేస్తున్న కొన్ని ల్యాబ్‌ లను గుర్తించామని..అనుమతులు, రిజిస్ట్రేషన్లు లేకుండా ల్యాబ్‌లు నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు అధికారులు. నిబంధనలు ఉల్లంఘించిన ల్యాబ్స్ కు నోటీసులు జారీ చేసిన అధికారులు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

©️ VIL Media Pvt Ltd.