Reading Time: < 1 minute

మన తెలంగాణ / హైదరాబాద్ : రోడ్డు రవాణా శాఖ పై తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఆర్‌టిసి నియామకానికి, ఆర్‌టిసికి ఎలాంటి సంబంధం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఆర్‌టిసి నియామకాలు పోలీసు రిక్రూట్మెంట్ సెల్ పరిధిలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. డ్రైవర్‌కు 6 అడుగులు అనే తప్పుడు ప్రచారం సరికాదని ఆయనన్నారు. డ్రైవర్ పోస్ట్‌కు మోటారు వాహన చట్టం ప్రకారం 5.3 అడుగులు(160 సెంటిమీటర్లు) ప్రామాణికమని తెలిపారు. టికెట్ యాప్‌లో ఎలాంటి సమస్యలు లేవని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు మనుకోకపోతే చర్యలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.