Reading Time: < 1 minute

“ఇంకా పురుగుల మందు తాగలే.. బతికే ఉన్నావా?”.. రైతుతో గజ్వేల్ ఎమ్మార్వో మాటలివి..!

Caption of Image.

గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మార్వో స్వామి తీరుపై రైతు ఆవేదన చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సమస్య పరిష్కారం కోసం వెళ్తే రైతును అవహేళన చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. “ఇంకా పురుగుల మందు తాగలేదా.. బ్రతికే ఉన్నావా?” అంటూ రైతుతో ఎమ్మెల్యే మాట్లాడటం వీడియోలో స్పష్టంగా కనిపించింది. తన పరిస్థితి చూసి నవ్వు వస్తుందా అని రైతు ప్రశ్నించాడు. ‘‘అవును వస్తది.. బరాబర్ వస్తది” అంటూ ఎమ్మార్వో సమాధానం ఇచ్చాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎమ్మార్వో తీరుపై ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు. వ్యవసాయ భూమి, జీవనోపాధి కోల్పోయే పరిస్థితిలో ఉన్న రైతుకు ఇలాంటి అవమానం జరగడం శోచనీయం. రైతు సమస్యపై అధికారుల స్పందన ఇదేనా అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

©️ VIL Media Pvt Ltd.