Reading Time: < 1 minute
Tollywood Young Heroes Box Office Clash 2026 November And December Movie Releases

Tollywood Movie Releases: ఈ ఏడాది 2026 చివరి రెండు నెలల్లో బాక్సాఫీస్ వద్ద అసలైన సందడి మొదలుకానుంది. టాలీవుడ్ యంగ్ హీరోలంతా వరుస రిలీజ్‌లతో థియేటర్లపై దండయాత్రకు సిద్ధమవుతున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో క్యూ కడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. మరికొద్ది రోజుల్లోనే వెండితెరపై జరగబోయే ఈ భారీ వార్‌లో బ్లాక్‌బస్టర్ కొట్టి ఫామ్‌లోకి వచ్చే హీరో ఎవరు..? అసలు బరిలో నిలుస్తున్న ఆ హీరోలు, వారి చిత్రాలేంటో చూద్దాం.

నవంబర్ నెల మొదటి నుంచే బాక్సాఫీస్ వద్ద సందడి మొదలు కానుంది. నవంబర్ 12న శర్వానంద్ హీరోగా నటిస్తున్న’భోగి’ చిత్రం థియేటర్లలోకి రానుంది. దర్శకుడు సంపత్ నంది తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఒక పవర్‌ఫుల్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఆ వెంటనే నవంబర్ 19న యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న ‘ఈ నగరానికి ఏమైంది 2’ సీక్వెల్‌తో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ఆడియన్స్ ముందుకు రానున్నారు. ఇక మరుసటి రోజే, అంటే నవంబర్ 20న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ సైతం ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు.

ఆ తర్వాత నెల డిసెంబర్ మొదటి వారంలో టాలీవుడ్ కుర్ర హీరోల మధ్య బిగ్గెస్ట్ బాక్సాఫీస్ క్లాష్ జరగబోతోంది. డిసెంబర్ 4న ఒకే రోజు ఏకంగా మూడు క్రేజీ ప్రాజెక్టులు విడుదలకు సిద్ధమవుతున్నారు. నేచురల్ స్టార్ నాని ప్రొడక్షన్‌లో నితిన్ హీరోగా నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. సరిగ్గా అదే రోజున నాగచైతన్య నటించిన ‘వృషకర్మ’ చిత్రంతో పాటు విశ్వక్‌సేన్ నటిస్తున్న ‘లెగసీ’ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒకే తేదీన ముగ్గురు యంగ్ స్టార్స్ సినిమాలు తలపడుతుండటంతో అందరి దృష్టి ఈ క్లాష్‌పైనే ఉంది. మరి ఈ మూడు చిత్రాలలో బాక్సాఫీస్ రేసులో చివరి వరకు నిలబడేది ఎవరు.? ఈ ఏడాది చివరి రెండు నెలల్లో బాక్సాఫీస్‌ను శాసించే ఆ విజేతలు ఎవరవుతారనేది చూడాలి.