Reading Time: 2 minutes

బిగ్‌బాస్10 ‘మహా పరీక్ష’: మొదటి రోజు నుంచే కాకరేపుతున్న టాస్క్‌లు.. ప్రైజ్ కీస్ గెలిచేది ఎవరు?

Caption of Image.

బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ గ్రాండ్ గా సెప్టెంబర్ 6న ప్రారంభమైంది. గత సీజన్లకు పూర్తిగా భిన్నంగా.. ఊహికందని ట్విస్టులతో కింగ్ నాగార్జున హోస్ట్ గా ఈ సారి ఈ షోను సరికొత్తగా ఆరంభించారు. ఈ 10 సీజన్ ప్రత్యేకతే ‘ దశావతారం’ . ప్రతి వారం ఒక కొత్త అవతారం , సరికొత్త ఛాలెంజ్ తో కంటెస్టెంట్లకు అసలైన సవాలు విసరనున్నారు బిగ్ బాస్.

‘మహా పరీక్ష’ మొదలు..

ఇప్పటివరకు ఏ సీజన్‌లోనూ లేని విధంగా..’హౌస్‌మేట్స్’ ఎవరూ లేకపోవడం ఈ సీజన్  మొదటి వారంలో అతిపెద్ద ట్విస్ట్. హౌస్‌లోకి అడుగుపెట్టిన వారంతా ప్రస్తుతం కేవలం ‘కంటెస్టెంట్లు’ మాత్రమే. మొదటి వారంలో వారందరిని ఒక మహాపాజిటివ్ లో  తేవడానికి నాగార్జున ‘మహా పరీక్ష’ అవతారంగా ప్రకటించారు. ఇక్కడి నుంచి ప్రతిక్షణం ఓ పరీక్షే.. వచ్చే శనివారం వరకు మహా పరీక్ష సాగుతుంది అని చెబుతూ నాగార్జున బిగ్‌బాస్ ప్రధాన ద్వారాలను లాక్ చేయడం ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తిని పెంచింది.

హౌస్ లో 16 మంది కంటెస్టెంట్లు..

గత సీజన్ మాదిరిగానే ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పించారు. ‘అగ్నిపరీక్ష 2’ ద్వారా ఎంపికైన సామాన్యులతో కలిపి మొత్తం 16 మంది హౌస్‌లో సందడి చేస్తున్నారు .వారిలో  సెలబ్రిటీ కంటెస్టెంట్లు నుంచి దేబ్జానీ మోదక్, త్రిగుణ్, సుధీర్ రెడ్డి, చైత్ర రాయ్, ఆటో రామ్ ప్రసాద్, నరేష్, టెంపర్ వంశీ, కృష్ణుడు, వర్షిణి సౌందరరాజన్. కామన్ మ్యాన్ కంటెస్టెంట్లు నుంచి ఝాన్సీ, అమర్, షాలిని, సృష్టి, ఆర్జే చరణ్, రోహిత్ హౌస్ లోకి అడుగుపెట్టారు.

అసలైన ఆట స్టార్ట్..

ఇక తాళాలు పడిన హౌస్‌లో అసలైన ఆట అప్పుడే మొదలైంది. కంటెస్టెంట్లు హౌస్‌మేట్స్‌గా మారేందుకు, తమ ఉనికిని చాటుకునేందుకు ‘మేజికల్ కీస్’ (Magical Keys) కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. ఈ తాళంచెవులే మొదటి వారంలో వారి భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. శారీరక, మానసిక బలాన్ని పరీక్షించే టాస్కులతో హౌస్‌లో కాక పుడుతోంది.

►ALSO READ | కొత్త అనుభూతిని పంచే మండాడి

ప్రసారం టైమ్ ఇదే..
ఈ ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ రియాలిటీ షో ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 గుంటలకు ప్రసారం అవుతోంది. కింగ్ నాగార్జున హోస్ట్ చేసే వీకెండ్ ఎపిసోడ్ లు మాత్రం శని , ఆదివారాల్లో రాత్రి 9:00 గంటల నుంచి  స్టార్ మా టెలివిజన్ ఛానల్ తో పాటు జియో హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.

రసవత్తర పోరు..

ఈ సారి ఈ బిగ్ బాస్ రియాలిటీ షో రసవత్తరంగా జరగనుంది. ఒకవైపు గ్లామర్, మరోవైపు కామన్ మ్యాన్ జోష్.. వీటికి తోడు బిగ్‌బాస్ విసిరే కఠిన సవాళ్లు. ఈ ‘మహా పరీక్ష’లో నెగ్గి అసలైన హౌస్‌మేట్స్‌గా మారేది ఎవరు? మొదటి వారంలోనే ప్రైజ్ కీస్ సాధించి ముందంజ వేసేది ఎవరు? అనేది ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులలో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. సెలబిట్రీలు, సామాన్యుల మధ్య పోటీ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

 

©️ VIL Media Pvt Ltd.