
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజునే తీవ్ర గందరగోళానికి దారి తీశాయి. అసెంబ్లీ బయట బీఆర్ఎస్ నేతల నిరసన ఉద్రిక్తతకు దారి తీస్తే… అసెంబ్లీ లోపల బీజేపీ ఎమ్మెల్యేల నిరసన గందరగోళానికి దారి తీసింది. అటు శాసన మండలిలో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి దారి తీశాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నల్లకుట్లోని లెక్క ప్లాన్ చేస్తున్నారని.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఇచ్చే డైరెక్షన్ ఇదేనా అంటూ మండిపడ్డారు.
స్పీకర్ ను ఉద్దేశించి అభ్యంతర వ్యాఖ్యలు చేసారంటూ తాతా మధుపై ఫైర్ అయ్యారు అద్దంకి. తాతా మధుపై చర్యలు తప్పవని అన్నారు. కేసీఆర్ సభకు వచ్చి తాత మధు వ్యాఖ్యల పై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ లీడర్ లెస్ పార్టీ అని.. దళితులపై గౌరవం ఉంటే సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని అన్నారు. స్పీకర్ ని గౌరవించని కుసంస్కృతి బిఅరెస్ ది అని మండిపడ్డారు.
►ALSO READ | పోలీసుల గొంతు పిసుకుతూ.. బూతులు తిడుతూ.. అసెంబ్లీ దగ్గర రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
దళితుల త్యాగాలపై తెలంగాణ వచ్చిందని.. బీఆర్ఎస్ అంటే బూతు రాష్ట్ర సమితి అని అన్నారు. బీఆర్ఎస్ బూతు రాజకీయాలను యావత్తు దళిత సమాజం గమనించాలని.. ఎక్స్ క్లూజివ్ బూతులు వాడే వారు బిఅరెస్ నేతలే అని అన్నారు. హారిష్ రావు, కేటీఆర్ తాత మధు భాష పై సమాధానం చెప్పాలని అన్నారు.