
లక్నో: యూపీ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నానక్ రామ్ భుర్జీ ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి కిందపడి మృతిచెందారు. మంగళవారం(జూలై28) లక్నోలోని హజ్రత్‌గంజ్ ప్రాంతంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంపీలు నివాసం ఉండే దారుల్షఫాలో ఓ ఎమ్మెల్యే ఇంటివెనక ఉన్న పై అంతస్తు నుంచి పడి నానక్ రామ్ భుర్జీ మృతిచెందారు. 68 ఏళ్ల భుర్జీ రాష్ట్ర మంత్రిగా పనిచేశారని, బీజేపీతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉందని యూపీ బీజేపీ వర్గాలు ప్రకటించాయి.
పోలీసుల కథనం ప్రకారం.. ఎమ్మెల్యేల నివాస భవనం కాంప్లెక్స్ వెనుక ఉన్న ఓ ఎమ్మెల్యే పై అంతస్తు నుంచి భుర్జీ కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. భుర్జీని చికిత్సకోసం సివిల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతిచెందినట్లు ప్రకటించారు.
►ALSO READ | కావేరీ జలాల వివాదం.. మేకెదాటు ప్రాజెక్టుకు అనుమతులివ్వొద్దు..ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం లేఖ
భుర్జీ చాలా కాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని, ఎమ్మెల్యే నివాస సముదాయం చుట్టూ తరచుగా తిరుగుతూ కనిపించేవాడని తేలిందని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు కొనసాగుతోంది.
लखनऊ: BJP नेता नानकदीन भुर्जी की सातवीं मंजिल से गिरकर मौत।
नए विधायक निवास से नीचे गिरने के बाद BJP नेता नानकदीन भुर्जी की मौत।
स्थानीय लोगों ने घायल अवस्था में सिविल अस्पताल पहुंचाया, रास्ते में हुई मौत।
BJP पिछड़ा वर्ग प्रकोष्ठ के पदाधिकारी बताए जा रहे नानकदीन भुर्जी।
लालबाग… pic.twitter.com/va8BCRLqAz— Roshan Kumar Journalist (@cameraman_r) July 28, 2026