Reading Time: < 1 minute

హైదరాబాద్ లో 53 శాతం పూర్తి.. ఆగస్టు 10న ఓటర్ల డ్రాఫ్ట్ రోల్ .. సర్ పై ఆర్వీకర్ణన్  కీలక ప్రకటన

Caption of Image.

హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు జిల్లాలో 53.3 శాతం ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేశామని వెల్లడించారు. ఎన్యూమరేషన్ ఫారం రాని వారు వెంటనే తమ ప్రాంతంలోని బీఎల్‌వోను సంప్రదించాలని, లేదా 1950 నంబర్‌కు కాల్ చేసి సమాచారం తెలుసుకోవాలని సూచించారు.

 ప్రస్తుతానికి 10 శాతం మందిని ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ కేటగిరీలో వేశామని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఆగస్టు 3వ తేదీ తుది గడువు కాబట్టి, ఓటర్లు వీలైనంత తొందరగా తమ ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్‌వోలకు అందజేయాలని కోరారు.ఆగస్టు 3 వరకు పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియ చేపడతామని ఆర్వీ కర్ణన్ తెలిపారు. 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లను గుర్తించి, ప్రతి స్టేషన్‌లో 1,200 లోపు ఓట్లు ఉండేలా సవరిస్తామన్నారు. అనంతరం ఆగస్టు 10న ఓటర్ల డ్రాఫ్ట్ రోల్ ప్రకటిస్తామని, సెప్టెంబర్ 9 వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరిస్తామని చెప్పారు. 

►ALSO READ | హైదరాబాద్‌లో ఈడీ సోదాలు: అమెరికన్లు టార్గెట్ గా సైబర్ మోసాలు..ప్రధాన నిందితుడు అరెస్ట్

ఫారాలను తప్పుగా నింపిన వారికి నోటీసులు జారీ చేస్తామని, ముఖ్యంగా చనిపోయిన వారి పేరిట ఫారాలు నింపి ఇస్తే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఓటు హక్కుకూ, ప్రభుత్వ పథకాలకూ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన ఆయన.. కొందరు రెండు చోట్ల ఓట్లు కలిగి ఉండి, హైదరాబాద్‌లో కాకుండా తమ ఊళ్లలోనే ఎన్యూమరేషన్ చేసుకుంటున్నారని  తెలిపారు.

 

©️ VIL Media Pvt Ltd.